స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.2కు క్యాస్టింగ్ కాల్..

మ‌ళ్లీరావా లాంటి ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఈ మ‌ధ్యే ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేసింది. యూ ట్యూబ్ సెన్సేష‌న్ ఆల్ ఇండియా బ‌క్ చోద్ ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను  రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మిస్తున్నారు.
నూత‌న ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్ జే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో న‌టించ‌డానికి క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 18 నుంచి 70 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సున్న ఔత్సాహిక న‌టుల‌కు అవ‌కాశం ఉంది. ఎవ‌రైనా స‌రే.. త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకుని సినిమాలో న‌టించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా.
హీరోయిన్ తో పాటు మేల్, ఫీమేల్ స‌పోర్టింగ్ ఆర్టిస్టుల కోసం క్యాస్టింగ్ కాల్ ఇచ్చారు. షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఈ చిత్రానికి మెంటల్ మ‌దిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ మాట‌లు అందిస్తున్నారు.
నిర్మాణ సంస్థ‌: స‌్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్
నిర్మాత‌: రాహుల్ యాద‌వ్ న‌క్కా
సంగీత ద‌ర్శ‌కుడు: మార్క్ కె రాబిన్
సినిమాటోగ్ర‌ఫర్: స‌న్నీ కుర‌పాటి
ఎడిటర్: అమిత్ త్రిపాఠి
మాట‌లు: వివేక్ ఆత్రేయ‌
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: స్వ‌రూప్ ఆర్ఎస్ జే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here