స‌త్తా ఉన్నా ఛాన్స్ లేని ప్ర‌వీణ్..

ఇండ‌స్ట్రీలో గుర్తు పెట్టుకోడానికైనా.. మ‌రిచిపోవ‌డానికైనా ఒక్క సినిమా చాలు. డిజాస్ట‌ర్ ఇస్తే ఎవ‌రు అంటారు.. బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తే రారా అంటారు. ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తార్ విష‌యంలో రెండోది జ‌రుగుతుంది. ఈయ‌న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌లేదు కానీ త‌న టేకింగ్ తో పిచ్చెక్కించాడు. అందుకే ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తా గురించి ఇండ‌స్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. గ‌తేడాది వ‌ర‌కు కూడా ఈ పేరును ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ఎందుకంటే ఈయ‌న కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేవు కాబ‌ట్టి. గుంటూర్ టాకీస్ విజ‌యం సాధించినా కూడా అది అడ‌ల్ట్ సినిమా. అందులో హీరోయిన్ల అందాలు.. డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తోనే సినిమా హిట్టైంది. దాంతో ప్ర‌వీణ్ స‌త్తార్ స‌త్తా ఎవ‌రికీ తెలియ‌లేదు. కానీ గ‌రుడ‌వేగ‌తో త‌న స‌త్తా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్. కానీ ఈయ‌న టేకింగ్ కు మాత్రం అంతా ఫిదా అయిపోయారు. అస‌లు ఉన్నాడ‌నే విష‌య‌మే మ‌రిచి పోయిన రాజ‌శేఖ‌ర్ ను హీరోగా పెట్టి థియేట‌ర్స్ కు ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించడం అంటే మాట‌లు కాదు.

అది చేసి చూపించాడు ప్ర‌వీణ్. గ‌త కొన్నేళ్లుగా రాజ‌శేఖ‌ర్ సినిమాల‌కు పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రావ‌డం లేదు. అలాంటిది గ‌రుడవేగ 6.3 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా త‌ర్వాత ఇప్పుడు రామ్ తో ఓ సినిమా మొద‌లుపెట్టాడు ప్ర‌వీణ్ స‌త్తార్. అయితే బ‌డ్జెట్ కార‌ణంగా ఈ చిత్రం ఆగిపోయింది. ఆ త‌ర్వాత ధ‌నుష్ అనుకున్నారు కానీ అది కూడా కుద‌ర్లేదు. ఇప్పుడు గోపీచంద్ తోనే ఈ అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ చేస్తానంటున్నాడు ప్ర‌వీణ్.

అయితే ఈ సినిమా క‌థ ఎలా ఉన్నా బ‌డ్జెట్ విష‌యంలోనే భ‌య‌ప‌డుతున్నారు నిర్మాత‌లు. చిన్న హీరోల‌కు భారీ బ‌డ్జెట్ పెడితే అది బాగున్నా అంత మ‌ళ్లీ తిరిగి రాదు క‌దా అనేది వాళ్ల భ‌యం. గ‌రుడ‌వేగ‌తో జ‌రిగింది కూడా ఇదే. ఇదే రానా లాంటి హీరోతో తీసుంటే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యుండేదంటున్నారు విశ్లేష‌కులు. కానీ హీరోల ఎంపిక‌లో తేడా కొడితే మంచి క‌థ‌లు కూడా కంచికి వెళ్తున్నాయి. మ‌రి ఇప్పుడు ప్ర‌వీణ్ స‌త్తాను న‌మ్మి డ‌బ్బులు పెట్టే నిర్మాత ఎక్క‌డ ఉన్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here