స‌మంత ప్లేస్ కొట్టేసిన నిధి అగ‌ర్వాల్.. 


నిధి అగ‌ర్వాల్.. ఈ పేరు త్వ‌ర‌లోనే తెలుగు ఇండ‌స్ట్రీలో మార్మోగిపోవ‌డం ఖాయం. ప్ర‌స్తుతం ఈమె నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచిలో న‌టిస్తుంది. బేసిగ్గా బాలీవుడ్ కావ‌డంతో అమ్మ‌డుకు అస్స‌లు మొహ‌మాటాలే లేవు. అడిగినంత అందాలు ఆర‌బోస్తూ.. తొలి సినిమా విడుద‌ల‌వ్వ‌క ముందే టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయింది నిధి. ఈ అందాల నిధి ఇప్పుడు స‌మంత‌కు రీప్లేస్ మెంట్ గా మారిపోయింది. అదెలా అనుకుంటున్నారా..? స‌వ్య‌సాచి షూటింగ్ ప్ర‌స్తుతం న్యూ యార్క్ లో జ‌రుగుతుంది. అక్క‌డ సెంట్రల్ పార్కులో చైతూ, నిధిపై కొన్ని రొమాంటిక్ సీన్స్ తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు చందూమొండేటి. ఈ పార్క్ తో చైతూకు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. దానికి కార‌ణం ఏ మాయ చేసావే.. ఆ క్లైమాక్స్. అక్క‌డే చైతూ, స‌మంత‌ల‌పై పెళ్లి సీన్ కూడా తీసాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్. పై లోకంలో వాడు.. ఎప్పుడో ముడివేసాడూ అంటూ అప్ప‌ట్లో పాట కూడా పాడుకున్నారు. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు అక్క‌డ షూటింగ్ చేస్తున్నాడు చైతూ. కాక‌పోతే ఈ సారి స‌మంత ప్లేస్ లో నిధి అగర్వాల్ ఉంది. జులైలో స‌వ్య‌సాచి విడుద‌ల కానుంది. ఇందులో హీరో ఎడ‌వ‌చేతికి బాడీతో సంబంధం ఉండ‌దు.. పైగా రెండు చేతుల‌కు ఒకేలా బ‌లం ఉంటుంది.. భార‌తంలో అర్జునుడికి ఇలా ఉంటుంది.. ఇదే కాన్సెప్ట్ తో ఇప్పుడు సినిమా వ‌స్తుంది. మ‌రి చూడాలిక‌.. స‌వ్య‌సాచి ఎలా ఉండ‌బోతుందో..? ఇందులో భూమిక‌, మాధ‌వ‌న్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here