స‌మ్మోహ‌నం.. సినిమా వ‌ర్సెస్ ఆర్ట్..!

Sammohanam
సాధార‌ణంగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమాలు చాలా కూల్ గా ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీలు లేకుండా వెళ్ళిపోతుంటాయి. కానీ ఈ సారి ఈయ‌న కూడా స్టైల్ మార్చాడు. స‌మ్మోహ‌నం అంటూ సాఫ్ట్ టైటిల్ పెట్టి లోప‌ల సినిమా వాళ్లపై ఫుల్ సెటైర్లు వేసాడు. వాళ్ల కారెక్ట‌ర్స్ తో ఆడుకున్నాడు. ఈ రోజుల్లో ఓ సినిమాపై అంచ‌నాలు పెరగాలంటే టైటిల్ కీల‌కం. అది బాగుంటే ఆటోమేటిక్ గా అంచ‌నాలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఇదే చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేస్తోన్న సినిమాకు స‌మ్మోహ‌నం అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టాడు. సుధీర్ బాబు ఇందులో హీరో. టీజ‌ర్ తోనే సినిమా బాగుంటుంద‌నే అంచ‌నా వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాలో ఏదో గ‌ట్టిగా ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌య్యేలా చెబుతుంది. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీపై కావాల్సిన‌న్ని సెటైర్లు వేసాడు ఇంద్ర‌గంటి. సినిమా వాళ్లంటే ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఉంటారు.. వాళ్ల‌కు కారెక్ట‌ర్స్ ఉండ‌వ‌నే మాట‌లు కూడా మాట్లాడించాడు. శివలెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మాత‌. జెంటిల్ మ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైద్రీ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుండ‌టం విశేషం. సినిమాలో కూడా సినిమా హీరోయిన్ గానే న‌టిస్తుంది అదితిరావ్. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత‌ నిజంగానే మ‌నం చూస్తున్న‌ది ఇంద్ర‌గంటి సినిమానా.. లేదంటే మ‌ణిర‌త్నం సినిమానా అనిపించ‌క మాన‌దు. అంత రిచ్ గా పిజి విందా త‌న సినిమాటోగ్ర‌ఫీతో మాయ చేసాడు. మ‌రి చూడాలిక‌.. ఈ ఘ‌ట్ట‌మ‌నేని అల్లుడితో ఇంద్ర‌గంటి స‌మ్మోహ‌నం ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here