స‌ర్వ‌స్వం ధార‌పోస్తున్న నిఖిల్..

Nikhil Mudra
ప్ర‌మోష‌న్ అంటే మ‌న హీరోల‌కు చిన్న విష‌యం. ఏదో రెండ్రోజులు అలా అంద‌రికీ పిలిచి ఇంట‌ర్వ్యూలు ఇచ్చేసి.. ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే అయిపోతుంది. కానీ బాలీవుడ్ లో అలా కాదు. వాళ్లు సినిమాకు నెల రోజుల ముందు నుంచే దేశాన్ని చుట్టేస్తుంటారు. ఇప్పుడు నిఖిల్ కూడా ఇదే చేస్తున్నాడు. కిరాక్ పార్టీ కోసం ఈయ‌న తెగ తిరిగేస్తున్నాడు. అంద‌రికీ సినిమాను చేరువ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. త‌న సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్నాడు ఈ కుర్ర హీరో. నాలుగు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. త‌క్కువ‌ టైమ్ ఉండ‌టంతో ప్ర‌మోష‌న్ల‌తోనే కాలం గ‌డిపేస్తున్నాడు ఈ హీరో. ఎంత హిట్ల‌లో ఉన్నా కూడా ఒక్క ఫ్లాప్ వ‌స్తే ప‌ట్టించుకోరు. అందుకే అది రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు నిఖిల్. విజ‌య‌వాడ‌లో మార్చ్ 10న భారీ ఈవెంట్ చేస్తున్నారు కిరాక్ పార్టీ టీం. ఈ ఈవెంట్ లో డాన్సులు చేయబోతున్నాడు ఈ హీరో. నిఖిల్ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు కిరాక్ పార్టీ సినిమాపైనే ఉన్నాయి. ఇది కానీ హిట్టైతే మ‌నోడి మార్కెట్ మ‌రింత పెరగ‌డం ఖాయం. ఇప్ప‌టికే 15 కోట్లు దాటేసి.. 20 కోట్ల వైపుగా ప‌రుగులు తీస్తుంది ఈయన మార్కెట్. ఇప్పుడు కానీ కిరాక్ పార్టీ హిట్టైతే మ‌నోడు పండ‌గ చేసుకోవ‌డం ఖాయం. మార్చ్ 16న సినిమా విడుద‌ల కానుంది. ఓ శివ‌.. ఓ హ్యాపీడేస్ క‌లిపితే మా కిరాక్ పార్టీ అంటున్నాడు నిఖిల్. మ‌రి ఈయ‌న ఆశ‌ల్ని సినిమా ఎంత వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here