స‌ల్మాన్ కు బెయిల్..


స‌ల్మాన్ ఫ్యాన్స్ కు ఖుషీ ఖ‌బ‌ర్. ఆయ‌న‌కు బెయిల్ వ‌చ్చింది. రెండు రోజులు జైల్లో ఉండ‌గానే ఇంక మీరు బ‌య‌టికి వెళ్లండి అంటూ బెయిల్ ఇచ్చింది కోర్ట్. ఈ రెండు రోజుల జైలు జీవితంలోనే చాలా మ‌లుపులు చూసాడు కండ‌ల‌వీరుడు.
ఆయ‌న‌కు శిక్ష విధించిన జడ్జ్ ను రాత్రికి రాత్రే ట్రాన్స్ ఫ‌ర్ చేసారు. ఇక ఇప్పుడు ఆయ‌న స్థానంలోకి వ‌చ్చిన కొత్త జ‌డ్జ్ పెద్ద‌గా ఏం మాట్లాడకుండానే బెయిల్ గ్రాంటెడ్ అంటూ ముద్ర వేసాడు. దాంతో ఫ్యాన్స్ ఖుషీలో మునిగిపోయారు.
స‌ల్మాన్ మ‌రికాసేప‌ట్లోనే జోధ్ పూర్ సెంట్ర‌ల్ జైల్ నుంచి విడుద‌ల కానున్నాడు. ఈయ‌న‌పై 700 కోట్ల‌కు పైగా బిజినెస్ న‌డుస్తుందిప్పుడు ఇండ‌స్ట్రీలో. ఈయ‌న గానీ జైల్లో ఉంటే వాళ్లంతా చాలా న‌ష్ట‌పోతారు.
దానికితోడు స‌ల్మాన్ త‌ర‌ఫు లాయ‌ర్స్ కూడా కేస్ ను బ‌లంగా వాదించ‌డంతో బెయిల్ ఈజీగానే వ‌చ్చేసింది. ఇప్పుడు హాయిగా బ‌య‌టికి వ‌చ్చి సినిమాలు చేసుకోవ‌చ్చు ఈ హీరో. కాక‌పోతే ఇండియా వ‌దిలి వెళ్ళ‌డానికి మాత్రం కోర్ట్ ప‌ర్మిష‌న్ కావాలి. దానికితోడు 50 వేల ఫైన్ తో బెయిల్ వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here