హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్ లెటర్ బయటపడింది!

ఉదయ్ కిరణ్ చనిపోయి నాలుగేళ్లు కావొస్తుంది. హీరో గా ఒక వెలుగు వెలిగి, పెళ్లయిన ఏడాదికే ఒంటరి వాడై ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అందరిని కలిచివేసింది. ఇప్పుడు ఆయన రాసిన సూసైడ్ నోట్ బయటపడిందంటూ నెట్లో ఓ లెటర్ హల్చల్ చేస్తుంది. లెటర్ లో ఏమి రాసుందంటే… విషిత, మా అమ్మ ను ఎంత ప్రేమించానో నిన్ను కూడా అంతే ప్రేమించాను. ఒకప్పుడు నాకు అందరూ ఉండేవారు ఇప్పుడు నీవు తప్ప నాకు ఎవరు లేరు. సినిమా పిచ్చి తో ఇండస్ట్రీ కి వచ్చాను. కానీ ఈ ఇండస్ట్రీ నన్ను పిచ్చోడిని చేసి ఆడుకుంది. నీకు ఇచ్చిన మాట నెరవేర్చలేక పోయాను. ఇవాళ ఒక ప్రొడ్యూసర్ నాకు కాల్ చేస్తానని చేయలేదు. నేను అంత పనికిరాని వాడినైపోయానా? నిజమేనేమో అందుకే అందరు నన్ను దూరంపెట్టేసారు నీతో సహా. విషి నన్ను నమ్ము వాడు నిజంగా మంచోడు కాడు. నేను ఎం చెప్పిన వినే స్టేజ్ లో నువ్వు లేవని నాకు అర్ధమయింది. దేర్ విల్ బి ఎ డే, ఆ రోజు నా బాధ, నా మాటలు నీకు బాగా అర్ధమవుతాయి. కానీ అప్పుడు నీ పక్కన ఈ ఉదయ్ ఉండడు. నువ్వు ఎంత ఏడ్చినా తిరిగి రాలేడు. అనవసరంగా మన గొడవల వల్ల అంకుల్ ఆంటీ ఇబ్బందిపడుతున్నారు . అందరికి నా వల్లే కదా ఇంత బాధ. ఇంకా మీ ఎవరికీ ఏ బాధ ఉండదు. ప్రతి దానికి ఒక ఎక్సపైరి డేట్ ఉంటుంది, ఇవాళ నా ఎక్సపైరి డేట్ అయిపోయింది. ఒకసారి యు.ఎస్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీస్కో. ప్లీజ్ మా అమ్మ నగలు మా అక్క కు ఇచ్చేయ్. ఆలా అయినా మా అమ్మ జ్ఞాపకాలు మా అక్క దగ్గర ఉంటాయి. అదే నా చివరి కోరిక అనుకో. అమ్మ నాకు ఎవరు లేరమ్మ…నువ్వు తప్ప…ఒక్క సారి నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలనుందమ్మ. అందుకే వచ్చేస్తున్నా నీ దగ్గరకు. లవ్ యూ రిషి, లవ్ యూ ఫర్ ఎవర్. ఈ లెటర్ చదివి కంట తడిపెట్టకుండా ఎవరు ఉండలేరేమో. ఆయన ఆత్మకు శాంతి కలుగు గాక