హీరో సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా “చిలసౌ” ఫస్ట్ లుక్ విడుదల

సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం “చి ల సౌ”. ఈ చిత్రాన్ని జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్నారు. సుశాంత్ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు (మార్చి 18) చిత్ర కథానాయకుడు సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జస్వంత్ నడిపల్లి మాట్లాడుతూ.. “సుశాంత్ హీరోగా “చిలసౌ” చిత్రాన్ని నిర్మిస్తూ చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రామిసింగ్ ఫిలిమ్ గా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రేపు మా హీరో సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మే 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అనుహాసన్, రాహుల్ రామకృష్ణ, జయప్రకాష్, విద్యుల్లేఖ, సంజయ్ స్వరూప్, హరీష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్స్: రవికుమార్ యండమూరి-వాసిరెడ్డి, చీఫ్ కో డైరెక్టర్: డి.సాయికృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ శర్మ (వివి), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయలగుండ్ల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ ఆర్.విహారి, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, నిర్మాత: జస్వంత్ నడిపల్లి, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here