హైదరాబాద్ సీక్రెట్ తెలుసుకున్న ఇవాన్క?

Ivanka-Trump-about-KCR-&-Chandrababu-Naidu
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు మరియు సలహాదారు ఇవాన్క ట్రంప్ హైదరాబాద్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. గ్లోబల్ ఎంటర్ ప్రైన్యూస్ సమ్మిట్ వేదిక ప్రారంభ సభలో తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రసంగిస్తూ హైద్రాబాద్ బిర్యానీ టేస్ట్ చేయండి అని అనడం చర్చనీయాంశం అయ్యింది. పూర్వం భాగ్యనగరం కేవలం బిరియాని కి ఫేమస్ అయినా, అది ఇప్పుడు కలం చెల్లిన మాట అని,
 హైదరాబాద్ అంటే ఇప్పుడు ఐటి అని చాలామంది తమ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. నిజాంలను ఆరాధించే వ్యక్తి కాబట్టే కెసిఆర్ ఆలా అన్నారని అందరు అంటున్నారు. దశాబ్దం పాటు ముఖ్యమంత్రి గా ఉండి, సాఫ్ట్ వేర్ పురోగతికి పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సమావేశానికి పిలవక పోవడాన్ని జీర్ణించుకోలేని తెదేపా నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు ఇవాన్క ను అమరావతిని సందర్శించాలని కోరితే ఆమె సున్నితంగా తిరస్కరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యం లో ఇవాన్క కు హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కి నాంది పలికింది చంద్రబాబు అని తెలుసుకుని ఆయన్ను అభినందించారని సామజిక మాధ్యమం లో ప్రచారం జరుగుతుంది.
 ఇవాన్క కు ఈ విషయాన్నీ స్వయానా నరేంద్ర మోదీ చెప్పారట. అంతే కాకుండా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇటీవలే విశాఖపట్నంలో వ్యవసాయ సమావేశం లో పాల్గొనడం, చంద్రబాబుతో భేటీ కావడం ఇవాన్క దృష్టికి వెళ్లిందట, ప్రస్తుత మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల ద్వారాకూడ బాబు గురించి ఇవాన్క కు తెలిసి ఉండవచ్చని అనుకుంటున్నారు. జి ఈ ఎస్ ప్రారంభోత్సవ సభ లో మాట్లాడుతూ ఇవాన్క హైదరాబాద్ బిరియాని టేస్ట్ చేస్తే చేస్తానని కచ్చితంగా చెప్పక పోవడం, హైదరాబాద్ ఐటీ కి మరింత ప్రసిద్ధి అనడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here