హ‌మ్మ‌య్యా.. ఆమె పెళ్లైపోతుంద‌ట‌..!

ఎవ‌రైనా హీరోయిన్ పెళ్లైపోతుంటే అభిమానులు అయ్యో అప్పుడే పెళ్లేంటి అని కాస్త బాధ ప‌డుతుంటారు. కానీ భావ‌న విష‌యంలో మాత్రం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భావ‌న‌.. ఈ పేరుకు తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా క్రేజ్ లేదు. ఇక్క‌డ చేసిన సినిమాల‌న్నీ ప్లాప్ అయ్యాయి కూడా. దాంతో పేరు తెలిసే ఛాన్స్ కూడా త‌క్కువే. కానీ క‌న్న‌డ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లో ఈ భామ‌కు క్రేజ్ ఎక్కువే. అక్క‌డే సినిమాలు కూడా బాగా చేసింది భావ‌న‌. ఇక ఈ మ‌ధ్యే ఈమె పేరు ఓ ఇష్యూలో బాగా వినిపించింది. అదే దిలీప్ కుమార్ ఇష్యూ. అప్ప‌ట్లో ఓ కార్ లో సిటీ అంతా తిప్పుతూ భావ‌న‌పై లైంగిక దాడి చేయించాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు దిలీప్. ఈ ఇష్యూలో దిలీప్ పై మ‌హిళా సంఘాల‌తో పాటు కోర్ట్ కూడా చాలా సీరియ‌స్ అయింది. జైలు శిక్ష‌ కూడా వేసింది.
ఈ ఇష్యూ త‌ర్వాత భావ‌న‌పై చాలా మందిలో తెలియ‌ని సానుభూతి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ భామ‌కు ఇప్పుడు పెళ్లి సెట్ట‌యింది. కన్నడ నిర్మాత నవీన్ తో ఈ ఏడాది మార్చి 9న నిశ్చితార్థం చేసుకుంది భావ‌న‌. ఆ త‌ర్వాతే ఈ ఇష్యూ జ‌రిగింది. పెళ్లిపై అనుమానాలు వ‌చ్చిన త‌రుణంలో వ‌చ్చే ఏడాది జనవరి 22న త్రిసూర్‌లో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మ‌ధ్య‌లో పెళ్లి జ‌ర‌గ‌బోతుంద‌ని తెలుస్తుంది. పెళ్లి తర్వాత ఏర్పాటు చేసే విందుకు సినీ ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. భావ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైంది. 2002లో ఓ మలయాళ చిత్రంతో నటిగా పరిచయం అయ్యిందీమే. ఆ త‌ర్వాత తెలుగులో ఒంట‌రి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. నితిన్ తో హీరో.. శ్రీ‌కాంత్ తో మ‌హాత్మ సినిమాల్లో న‌టించింది. క‌న్న‌డ‌లోనూ చాలా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ఇప్పుడు ఓ ఇంటిది కాబోతుంది. ఈమె మ్యారీడ్ లైఫ్ బాగుండాల‌ని కోరుకుందాం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here