హ‌మ్మ‌య్యా.. వాళ్ళు వెన‌క్కి త‌గ్గారు.. 

ఉన్న‌ది ఒక‌టే జింద‌గీలా.. కొంద‌రు హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇండ‌స్ట్రీలో ఉన్న‌ది ఒక్క‌టే డేట్ అంటూ అంతా ఫిబ్ర‌వ‌రి 9 వైపు చూసారు. ఆ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల్లోనూ హై టెన్ష‌న్ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఐదు సినిమాల నుంచి రేస్ మూడు సినిమాల‌కు త‌గ్గింది. చాలా రోజులుగా ఈ తేదీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ రోజు వ‌స్తాయ‌నుకున్న ఐదు సినిమాల్లో మూడు రేస్ నుంచి త‌ప్పుకున్నాయి. ఇప్పుడు ఇంటిలిజెంట్ తో పాటు మోహ‌న్ బాబు గాయ‌త్రి మాత్ర‌మే ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానున్నాయి. ఆ త‌ర్వాత రోజు వ‌రుణ్ తేజ్ తొలిప్రేమ విడుద‌ల కానుంది. వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇక వినాయ‌క్ ఇంటిలిజెంట్ పై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. మెగా హీరోలు ఇద్ద‌రూ ఒకేసారి వ‌స్తున్నా అది త‌మ‌కు పోటీ కాదంటున్నారు ఈ కుర్ర హీరోలు. ఇద్ద‌రం వ‌చ్చి బాక్సాఫీస్ తాట తీస్తామంటూ ధీమాగా చెబుతున్నారు. వీళ్లంద‌రితో పోటీ ప‌డ‌టానికి ముందు నిశ్చ‌యించుకున్నా.. చివ‌రి నిమిషంలో త‌న సినిమా వెన‌క్కి తీసుకున్నాడు నిఖిల్. ఈయ‌న న‌టిస్తోన్న కిరాక్ పార్టీ షూటింగ్ పూర్తయింది కానీ డేట్ ఖాళీ లేక వెన‌క్కి వెళ్లిపోయింది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ కిరాక్ పార్టీకి రీమేక్. ఇప్పుడు నిఖిల్ సినిమాల‌కు 20 కోట్ల మార్కెట్ వ‌చ్చింది. అంటే ఈ సినిమాపై కూడా అంచ‌నాలు భారీగా ఉన్న‌ట్లే. ఇక సాయిప‌ల్ల‌వి క‌ణం సినిమా కూడా ఫిబ్రవ‌రి 9 రేస్ నుంచి త‌ప్పుకుంది. ఈ చిత్రం కొత్త విడుద‌ల తేదీ ఎప్పుడో ఇంకా చెప్ప‌లేదు. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించారు. మొత్తానికి ఐదు సినిమాల రేస్ కాస్తా ఇప్పుడు రెండు సినిమాల‌కు ప‌రిమితం అయిపోయింది. మ‌రి ఈ పోటీలో ఎవ‌రికి పై చేయిగా నిలుస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here