హ‌లో.. ఈ పిల్ల మాయ చేసింది..

Hello is dream debut for Kalyani Priyadarshan

చూడ్డానికి చాలా అందంగా ఉంటే కాదు.. పోనీ న‌టించిన అనుభవం ఉందా అంటే లేదు.. కానీ తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకుంది క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. ఇప్పుడు ఇండ‌స్ట్రీ మొత్తం ఈ భామ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ మ‌ధ్య హ‌లో ఆడియో వేడుక‌లో క‌ళ్యాణి స్పీచ్ విన్నపుడే పాప చాలా కేక అని అర్థ‌మైంది. నాగార్జున నుంచి మొద‌లుపెట్టి అఖిల్ వ‌ర‌కు అంద‌ర్నీ మున‌గ‌చెట్టు ఎక్కించేసి ప‌ర్ ఫెక్ట్ హీరోయిన్ మెటీరియ‌ల్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు సినిమా విడుద‌లైంది. ఇంత మంది హీరోయిన్లు ఉండ‌గా.. విక్ర‌మ్ వెళ్లి వెళ్లి క‌ళ్యాణినే ఎందుకు కోరి తెచ్చుకున్నాడో సినిమా చూస్తుంటే అర్థ‌మైపోతుంది. స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన‌ట్లు.. అందంగా న‌టించింది క‌ళ్యాణి. త‌నకు ఇది చాలా మామూలు విష‌యం అన్న‌ట్లు క‌ళ్ళ‌తోనే ఎక్స్ ప్రెష‌న్లు ప‌లికించింది. ముఖ్యంగా అఖిల్ తో వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ లోనూ క‌ళ్యాణి చాలా బాగా న‌టించింది. క్లైమాక్స్ లో ఈ భామ న‌ట‌న అద్భుత‌మే. మొత్తానికి ఇండ‌స్ట్రీకి మ‌రో మంచి ప‌ర్పార్మ‌ర్ దొరికేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here