హ‌లో.. ఎక్క‌డికి వ‌చ్చి ఆగుతుంది..?

HELLO Designs
బాగోలేని సినిమాలు ఆడకపోతే హీరోలు.. ద‌ర్శకులు కూడా పెద్ద‌గా ఫీల్ అవ్వ‌రు. ఎందుకంటే త‌మ ప్ర‌య‌త్న లోపం అనుకుంటారు. కానీ కొన్నిసార్లు బాగున్న సినిమాలు కూడా బాగా ఆడ‌వు. మంచి టాక్ వ‌స్తుంది.. థియేట‌ర్స్ ఉంటాయి.. స్టార్ క్యాస్ట్ ఉంటుంది.. కానీ ఏదో ఓ చోట మిస్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు హ‌లో సినిమా విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రానికి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్లుంది ప‌రిస్థితి. అఖిల్ హీరోగా న‌టించిన ఈ చిత్రం గ‌త వార‌మే విడుద‌లైంది. సినిమాకు తొలి షో నుంచే టాక్ అద్భుతంగా వ‌చ్చింది. అదిరిపోయింది.. అఖిల్ న‌ట‌న అదుర్స్ అన్నారు. కానీ ఆ దూకుడు క‌లెక్ష‌న్ల ద‌గ్గ‌ర క‌నిపించ‌ట్లేదు హ‌లోలో అఖిల్ కు డాన్సులు.. ఫైట్లు అన్నింటికీ మించి ల‌వ్.. ఇవ‌న్నీ హ‌లోలో స‌రిగ్గా ప‌డ్డాయి. కానీ వ‌సూళ్ల ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి నాని స్టార్ ప‌వ‌ర్ ముందు సిసింద్రీ నిల‌బ‌డ‌లేక‌పోయాడేమో అనిపిస్తుంది. మ‌రో టైమ్ లో వ‌చ్చుంటే క‌చ్చితంగా హ‌లో ప‌రిస్థితి మ‌రోలా ఉండేది.
ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు హ‌లో. కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం ఈ చిత్రం మిలియ‌న్ మార్క్ వైపు దూసుకెళ్లిపోతుంది. ఇదొక్క‌టే ఇప్పుడు అఖిల్ కు క‌లిసొచ్చే అంశం.  తొలి నాలుగు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 12 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది హ‌లో. పైగా సెల‌వులు కూడా అయిపోయాయి. మ‌రోవైపు ఎంసిఏ వ‌సూళ్ల వేట‌లో టాప్ లో ఉంది. వీట‌న్నింటినీ త‌ట్టుకుని హ‌లో చివ‌రివ‌ర‌కు 20 కోట్ల మార్క్ కూడా అందుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. మ‌రోవైపు ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 32 కోట్ల‌కు చేసాడు నాగార్జున‌. మొత్తంగా చూసుకుంటే అఖిల్ కు మ‌రోసారి నిరాశే ఎదురైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here