హ‌లో గురించి ఏం మాట్లాడ‌ని నాగార్జున‌..

HELLO!-Pre-Release-Event-Photos
ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఓ ఫంక్ష‌న్ చేసిన‌పుడు క‌చ్చితంగా త‌మ సినిమా గురించి ఆ సినిమా నిర్మాత మాట్లాడాల్సిందే. కానీ నాగార్జున మాత్రం హ‌లో గురించి ఏం మాట్లాడ‌లేదు. ఆయ‌న మాట్లాడాల్సిందంతా మొన్న ఆడియో వేడుక‌లోనే చెప్పాడు. దాంతో ఇప్పుడు మాట్లాడ్డానికి కూడా ఏమీ లేదు. అందుకే అఖిల్ ను ఉద్దేశించి రెండు మాట‌లు మాట్లాడి.. సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులే చెబుతారులే అని మైక్ మ‌రొక‌రికి ఇచ్చేసాడు నాగార్జున‌. ఇప్ప‌టికే హ‌లో చిరంజీవితో పాటు క‌లిసి చూసిన నాగ్.. ఆ కాన్ఫిడెన్స్ తోనే క‌నిపిస్తున్నాడు. హ‌లోతో క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అనే న‌మ్మ‌కంతోనే ఉన్నాడు ఈ హీరో. ఈ కాన్ఫిడెన్స్ నాగార్జున క‌ళ్ళ‌లో క‌నిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది.. ఏ టెన్ష‌న్ లేదిప్పుడంటూ హ‌లో ప్రీ రిలీజ్ లో సినిమాపై ఉన్న న‌మ్మ‌కాన్ని చెప్పాడు నాగార్జున‌. ఇక వేడుక‌కు వ‌చ్చిన చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్ కు కూడా ధన్య‌వాదాలు తెలిపాడు. అస‌లు చ‌ర‌ణ్ ను అఖిల్ ఎప్పుడు పెద్ద‌న్న‌య్య‌ను చేసుకున్నాడో త‌న‌కు తెలియ‌దని.. కానీ వాళ్ళిద్ద‌రూ అలా ఉండ‌టం త‌న‌కు కూడా చాలా న‌చ్చుతుందని చెప్పాడు నాగార్జున‌. మొత్తానికి హ‌లో ప్రీ రిలీజ్ లో చాలా కూల్ గా క‌నిపించాడు నాగార్జున‌. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం నిజంగానే రేపు సినిమాలో క‌నిపిస్తుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here