హ‌లో.. గ‌ట్టిగా అనుకో అఖిల్..!

అన్నీ మ‌నం అనుకున్న‌ట్లు జ‌రిగితే అది జీవితం ఎందుకు అవుతుంది..? స‌్టార్ హీరో కొడుకైనా అదృష్టం క‌లిసిరాక‌పోతే ఫ్లాప్ హీరో అవుతాడు. అఖిల్ తొలి సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన అఖిల్ డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఫ్రెష్ గా రేస్ మొద‌లుపెట్టాడు ఈ కుర్ర హీరో. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి అఖిల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యుంటే ఈ పాటికి అఖిల్ స్టార్ అయ్యేవాడు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దాంతో ఇప్పుడు అఖిల్ ఆశ‌ల‌న్నీ హ‌లో సినిమాపైనే ఉన్నాయి. ఈయ‌న కెరీర్ ను ముంచినా.. తేల్చినా ఇప్పుడు హ‌లోనే. ఇది గానీ హిట్టైతే ఆటోమేటిక్ గా అఖిల్ స్టార్ అవుతాడు.. లేదంటే మాత్రం ఊహ‌కు కూడా అందదు ఆ న‌ష్టం. అఖిల్ మాత్రం హ‌లో సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అంటున్నాడు. ఈ న‌మ్మ‌కం నిల‌బెట్టుకోడానికి విక్ర‌మ్ కే కుమార్ కూడా మ్యాగ్జిమ‌మ్ ట్రై చేస్తున్నాడు.
డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అప్పుడు అఖిల్ ఆడియో వేడుక‌లో ఎలాగైతే అభిమానుల‌ను ఉర్రూత‌లూగించాడో.. ఇప్పుడు కూడా ఇదే చేసాడు అఖిల్. కాక‌పోతే అప్పుడు భ‌యం అస్స‌లు క‌నిపించ‌లేదు.. కానీ ఈ సారి అఖిల్ క‌ళ్ళ‌లో అది క‌నిపించింది. హ‌లో సినిమా ఈ కుర్ర హీరో కెరీర్ కు చాలా అంటే చాలా కీల‌కం. ఇది హిట్టైతేనే అఖిల్ కు ఇండ‌స్ట్రీలో లైఫ్ ఉంటుంది లేదంటే ఫెయిల్యూర్స్ వార‌సుల లిస్ట్ లోకి చేరిపోతాడు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు అఖిల్. మ‌రి చూడాలి.. వీళ్లంతా క‌లిసి అఖిల్ ను ఏం చేయ‌బోతున్నారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here