2 కంట్రీస్ ఎలా ఉండ‌బోతుంది.. టాక్ ఏంటి..? 

Sunil's-'2-Countries'-Set-To-Release-In-December!
సునీల్ ఇప్పుడు హీరోగా నిల‌బ‌డాలంటే క‌చ్చితంగా హిట్ కొట్టాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈయ‌న ఆశ‌ల‌న్నీ 2 కంట్రీస్ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రం ఇప్ప‌టికే పూర్త‌యింది.. సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 29న 2 కంట్రీస్ విడుద‌ల కానుంది. సెన్సార్ టాక్ ప్ర‌కారం చూస్తుంటే సునీల్ మ‌రోసారి పూర్తి కామెడీ సినిమాతోనే వ‌స్తున్నాడు. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ లోనే ఎక్కువ‌గా కామెడీ ఉంద‌ని.. అయితే అది కూడా రొటీన్ కామెడీ కావ‌డంతో ప్రేక్ష‌కులు ఎంత‌వర‌కు ఎంట‌ర్ టైన్ అవుతారో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌ళ‌యాలంలో సూప‌ర్ హిట్టైన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేసాడు ఎన్ శంక‌ర్. ఈ చిత్రంలో సునీల్ ప‌ల్లెటూరి అబ్బాయిగా న‌టించాడు. ఓ ప‌ల్లెటూరి అబ్బాయికి.. అమెరికా అమ్మాయికి పెళ్లి జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే విభేధాలే సినిమా క‌థ‌. సునీల్ కెరీర్ ఇప్పుడు నిలబ‌డాలంటే ఈ చిత్రం క‌చ్చితంగా ఆడాల్సిందే మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. అందుకే ప్ర‌మోష‌న్ లోనూ వేగం పెంచేసాడు సునీల్. ద‌ర్శ‌కుడు ఎన్ శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొత్తానికి చూడాలిక‌.. 2 కంట్రీస్ అయినా సునీల్ క‌ష్టాల‌ను గ‌ట్టెక్కిస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here