2 మిలియ‌న్ అంత సుల‌భ‌మా..?


ఒక‌ప్పుడు ఓవ‌ర్సీస్ లో మిలియ‌న్ మార్క్ అందుకోవ‌డం క‌ష్టంగా ఉండేది. ఆ త‌ర్వాత 2 మిలియ‌న్ సాధిస్తే అద్భుతం అనేవాళ్లు. కానీ ఇప్పుడు అది కూడా సుల‌భం అయిపోయింది. పెరిగిన మార్కెట్ దృష్ట్యా చిన్న సినిమాలు కూడా 2 మిలియ‌న్ వైపు అడుగేస్తున్నాయి. ఇప్పుడు మ‌హాన‌టి కూడా ఇంతే. ఈ చిత్రం విడుద‌లైన 9 రోజుల్లోనే ఓవ‌ర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అందుకుని.. ఇప్ప‌టికీ సూప‌ర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది.
ఈ ఏడాది ఇది నాలుగో 2 మిలియ‌న్ సినిమా కావ‌డం విశేషం. ఏడాది మొద‌ట్లో డిజాస్ట‌ర్ గా నిలిచినా కూడా అజ్ఞాత‌వాసి 2 మిలియ‌న్ క్రాస్ అయింది. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లం 3.5 మిలియ‌న్.. భ‌ర‌త్ అనే నేను 3.4 మిలియ‌న్ వ‌సూలు చేసాయి. ఇక ఇప్పుడు మ‌హాన‌టి జోరు చూస్తుంటే విదేశాల్లో ఈజీగా 2.8 మిలియ‌న్ వ‌ర‌కు వెళ్లేలా క‌నిపిస్తుంది. రెండో వీకెండ్ కూడా ఏ సినిమాలు లేవు. దానికితోడు ఇప్ప‌టికీ 120 లొకేష‌న్స్ లో ఈ చిత్రం ఉంది.
పైగా స్క్రీన్స్ ఇంకా పెంచుతున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే మ‌హాన‌టి అద్భుతాలు ఇప్ప‌ట్లో ఆగడం క‌ష్ట‌మే. దానికితోడు సావిత్రి జీవితం కావ‌డం.. మ‌న‌సుకు హ‌త్తుకునేలా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన తీరు ఇవ‌న్నీ మహాన‌టిని ఆకాశ‌మంత ఎత్తులో నిల‌బెట్టాయి. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసిన ఈ చిత్రం ఓవ‌రాల్ గా 24 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. థియెట్రిక‌ల్ బిజినెస్ 20 కోట్లే జ‌రిగిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజ్ లోకి వెళ్లిపోయింది. ఫుల్ ర‌న్ లో ఈజీగా ఇంటా బ‌య‌టా క‌లిపి 40 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here