2.0 టీజ‌ర్.. అదిరిందిగా ట్విస్ట్.. 

2.0 movie release officially confirmed in april
అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే అది శంక‌ర్ సినిమా ఎందుకు అవుతుంది..? ఈయ‌న కెరీర్ మొద‌లై 30 ఏళ్ల‌కు చేరువ‌వుతుంది. ఇన్నేళ్ల‌లో ఒక్క‌సారి కూడా ఏ సినిమాను చెప్పిన తేదీకి తీసుకురాలేదు ఈ ద‌ర్శ‌కుడు. దానికి కార‌ణం ఆయ‌న‌కు ప్లానింగ్ లేక కాదు.. ప‌ర్ ఫెక్ష‌నిజం ఎక్కువైపోయి. త‌ను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా వ‌చ్చేవ‌ర‌కు అస్స‌లు కాంప్ర‌మైజ్ కాడు ఈ ద‌ర్శ‌కుడు. అందుకే సినిమాలు ఒక్క‌టి కూడా చెప్పిన స‌మ‌యానికి రావు. ఇప్పుడు 2.0 సినిమాది కూడా ఇదే ప‌రిస్థితి. సినిమా సంగ‌తి దేవుడెరుగు.. క‌నీసం టీజ‌ర్ కూడా చెప్పిన టైమ్ కు విడుద‌ల చేయ‌డం లేదు శంక‌ర్. ఆయ‌న ఎలాగూ విడుద‌ల చేయ‌డ‌ని.. ఈ మ‌ధ్యే లీకు వీరులు టీజ‌ర్ ను విడుద‌ల చేసారు. మిగిలిన ద‌ర్శ‌కులైతే టీజ‌ర్ ఎలాగూ లీక్ అయింది క‌దా అని దాన్నే అఫీషియ‌ల్ గా విడుద‌ల చేస్తారు.
కానీ అక్క‌డున్న‌ది శంక‌ర్.. అలా చేస్తే ఆయ‌న శంక‌ర్ ఎందుకు అవుతాడు..? అందుకే ఇప్పుడు చిత్ర‌యూనిట్ కు పిచ్చెక్కించే షాక్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. టీజ‌ర్ ఎలాగూ వ‌చ్చింది క‌దా.. పాత టీజ‌ర్ నే విడుద‌ల చేద్దాం అంటే వ‌ద్దు చూసిన టీజ‌ర్ వ‌స్తే నేను ఒప్పుకోనంటూ కొత్త టీజ‌ర్ సిద్ధం చేయిస్తున్నాడు శంక‌ర్. ఉన్న టీజ‌ర్ విడుద‌ల చేయ‌డానికే ఇంత టైమ్ ప‌డుతుంటే ఇప్పుడు కొత్త టీజ‌ర్ అంటున్నాడు. అంటే ఇప్ప‌ట్లో ఈ టీజ‌ర్ ను చూసే మోక్షం ప్రేక్ష‌కుల‌కు ఉందో లేదో..? ప‌్ర‌స్తుతం అమెరికాలో టీజర్ కోసం వర్క్ జరుగుతోంది. ఈ సినిమా విడుద‌ల తేదీపై కూడా ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. సినిమా దివాళికి వ‌స్తుంద‌ని చెబుతున్నా.. అస‌లు 2018లో వ‌స్తుందా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here