2.0 ప్లానింగ్ అదుర్స్ క‌దా..

2.0 movie release officially confirmed in april

ర‌జినీకాంత్ లాంటి హీరో సినిమాలో ఉన్న‌పుడు ప్లానింగ్ అంటూ ప్ర‌త్యేకంగా ఏం అవ‌స‌రం లేదు. ఆయ‌నే అన్నీ చూసుకుంటాడు. ఆయ‌న క్రేజ్ సినిమాకు శ్రీ‌రామ‌ర‌క్ష‌. ఇప్పుడు 2.0 విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. పైగా శంక‌ర్ కూడా దీనికి ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్ ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్న‌ట్లు జరుగుంటే ఈ పాటికి 2.0 ట్రైల‌ర్ విడుద‌ల‌య్యేది. నిజానికి న‌వంబ‌ర్ లో టీజ‌ర్.. డిసెంబ‌ర్ లో ట్రైల‌ర్.. జ‌న‌వ‌రిలో సినిమా విడుద‌ల అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ ప‌క్క‌కెళ్లిపోయాయి. ఎప్రిల్ లో సినిమా విడుద‌ల అనేస‌రికి జ‌న‌వ‌రిలో టీజ‌ర్.. ఫిబ్ర‌వ‌రి లేదంటే మార్చ్ లో ట్రైల‌ర్.. ఎప్రిల్ లో సినిమా అంటున్నారు. హైద‌రాబాద్ లోనే టీజ‌ర్ లాంఛ్ జ‌ర‌గ‌బోతుంది. జ‌న‌వ‌రి 26న ఈ టీజ‌ర్ విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. దీనికి ర‌జినీతో పాటు అక్ష‌య్ కుమార్ కూడా హైద‌రాబాద్ రానున్నారు. ఇక్క‌డే ప్ర‌త్యేకంగా ఓ ఈవెంట్ చేసి టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతు న్నారు. ఇక మార్చ్ లో ట్రైల‌ర్ లాంఛ్ ఘ‌నంగా ప్లాన్ చేస్తున్నారు. ఎప్రిల్ 27న సినిమా విడుద‌ల కానుంది. ఆ తేదీపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఆ రోజే మ‌రో రెండు సినిమాలు కూడా ఉండ‌టంతో 2.0 ను ఎప్రిల్ 27న తీసుకురావ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఏం జ‌ర‌గ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here