20 ఏళ్ల నాటి సంఘటన చెప్పి తనకు మతిమరపు లేదని నిరూపించిన ముఖ్యమంత్రి

Chandrababu Naidu, Bill Gates at Agtech summit Vizag

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అల్జెమర్ వ్యాధి వచ్చిందని, ఆయన ముఖ్యమైన విషయాలు మర్చిపోతున్నారని గత కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అసిస్టెంట్లు ప్రోగ్రాం షెడ్యూల్ గుర్తుచేయగా, ఆయన నేను ఎప్పుడు చెప్పను అని అంటున్నారని సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

టీడీపీ మాత్రం అవన్నీ ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.సి.పి వారు పుట్టిస్తున్న పుకార్లని కొట్టిపారేశారు. తాజాగా చంద్రబాబు స్వయంగా ఈ వార్తలకు చెక్ పెట్టారు. విశాఖపట్నం లో నిన్న జరిగిన ఏ.పి. యాగటెక్ సమ్మిట్ (వ్యవసాయ సదస్సులో) మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాల్గొన్నారు. సదస్సు లో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు బిల్లగాట్లు తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ…20 ఏళ్ల క్రితం బిల్ గేట్స్ ను కలవడానికి వెళ్లినప్పుడు 10 నిముషాలు అప్పోయింట్మెంట్ ఇవ్వగా…తాను ల్యాప్ టాప్ తో ప్రెసెంటేషన్ ఇవ్వగా ఆ మీటింగ్ కాస్తా 45 నిమిషాలపాటు సాగిందని చెప్పారు. బాబు ల్యాప్ టాప్ తో ప్రెసెంటేషన్ ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రీ తానేనని గుర్తుచేశారు కూడా!