2017 రాజుగారిదే.. 2018 కూడా..!

Dil Raju

దిల్ రాజు.. ఇప్పుడు ఈ పేరుకు హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఓ నిర్మాత‌కు ఇంత‌గా క్రేజ్ ఉండటం మ‌న ఇండ‌స్ట్రీలో అస్స‌లు జ‌ర‌గ‌దు. అది ఇప్పుడు ఉన్న టైమ్ లో. హీరోలే రాజ్య‌మేలుతున్న టైమ్ లో త‌న‌కంటూ ఓ సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నాడు రాజు. ఆయ‌న త‌లుచుకోవాలే కానీ ఇండ‌స్ట్రీలో ఏ హీరో డేట్స్ లేవ‌ని చెప్ప‌డు. మ‌నోడి టైమ్ అలా న‌డుస్తుంది ఏం చేస్తాం మ‌రి..! ఓ ప‌క్క హీరోల డేట్స్ సంపాదించుకోడానికి ఇత‌ర నిర్మాత‌లు నానా తంటాలు ప‌డుతుంటే.. దిల్ రాజు మాత్రం ఈజీగా అంద‌రి డేట్స్ ప‌ట్టేస్తున్నాడు. ఇండ‌స్ట్రీలో ఉన్న కుర్రాళ్లంతా రాజుగారిగ‌దిలోనే ఉన్నారు. కావాలంటే చూడండి.. ఏడాది మొద‌ట్లో నానితో నేనులోక‌ల్ చేసాడు.. ఇప్పుడు ఎంసిఏ విడుద‌ల‌కు సిద్ధం చేసాడు. ఈ టైమ్ లో నాని డేట్స్ తీసుకోవ‌డం అంటే అంత ఈజీ కాదు. కానీ దిల్ రాజు త‌లుచుకుంటే ఏదీ క‌ష్టం కాదు.
శ‌ర్వానంద్ కూడా అంతే. శ‌త‌మానం భ‌వతితో మ‌నోడితో సూప‌ర్ హిట్ కొట్టాడు దిల్ రాజు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూత‌లు సినిమాలో శ‌ర్వానే ఓ హీరోగా తీసుకున్నాడు. ఈ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత‌. ఇక నితిన్ ను కూడా త‌న క్యాంప్ లోకి తీసుకుంటున్నాడు దిల్ రాజు. దిల్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌ని ఈ జోడీ.. ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేసారు. శ్రీ‌నివాస‌క‌ళ్యాణంతో 14 ఏళ్ళ త‌ర్వాత క‌ల‌వ‌నున్నారు. ఇక దాగుడు మూతలులో శ‌ర్వాతో క‌లిసి న‌టించ‌బోతున్నాడు నితిన్. రామ్ ను కూడా ఏడేళ్ల త‌ర్వాత త‌న కంపౌండ్ లోకి ఆహ్వానించాడు. త్రినాథ‌రావ్ న‌క్కిన‌తో త్వ‌ర‌లోనే రామ్ ఓ సినిమా చేయ‌నున్నాడు. రామ‌రామ కృష్ణ‌కృష్ణ త‌ర్వాత దిల్ రాజు-రామ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా ఇది. ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.
సాయిధ‌రంతేజ్, వ‌రుణ్ తేజ్ లాంటి కుర్ర హీరోలు కూడా దిల్ రాజు ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చేస్తారు. ఓ వైపు కుర్రాళ్ల‌ను హ్యాండిల్ చేస్తూ.. మ‌రో వైపు మ‌హేశ్ లాంటి స్టార్స్ తోనూ సినిమాల‌ను నిర్మిస్తున్నాడు ఈ నిర్మాత‌. మ‌హేశ్-వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోయే సినిమా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఇది మ‌హేశ్ కు 25వ సినిమా. దాంతో చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు దిల్ రాజు. సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇక కొత్త ద‌ర్శ‌కుడు శ‌శితో అదేనువ్వు అదేనేను సినిమా అనౌన్స్ చేసాడు దిల్ రాజు. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించే అవకాశం ఉంది. మొత్తానికి 2017నే కాదు.. 2018ని కూడా ముందే బ్లాక్ చేస్తున్నాడు దిల్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here