2020 నాటికీ దేశంలో ఏపీని మూడోస్థానంలో నిలబెడ్తా: చంద్రబాబు

మాటలు చెప్పినంత వీజీ కాదు కోటలు కట్టడం అనే సామెత అనుభవజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అయినా ఆయన 2020 నాటికీ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో మూడో స్థానంలో నిలుపుతామని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) వందో సమావేశం లో చెప్పడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్ లోటు తో విలవిలలాడే పరిస్థితులుంటే, ఏపీ ప్రభుత్వం 2020 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మూడోస్థానంలోకి తీసుకువెళ్తామని ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదం అని విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలవారు .
రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా ఏఎన్‌యూలో ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలను ప్రారంభించిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం. గవర్నర్ నరసింహన్ తో సహా పలువురు మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here