జవాన్ మూవీ రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

జవాన్ మూవీ రివ్యూ
తారాగణం: సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, ప్రసన్న
దర్శత్వం: బి.వి.ఎస్.రవి
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాత: కృష్ణ
బ్యానర్: అరుణాచల్ క్రియేషన్స్
కథ:
జై (సాయి ధరమ్) ఓ దేశభక్తి గల యువకుడు. డి.ఆర్.డి.ఓ సైంటిస్ట్ గా చేరి దేశ సేవ చేయాలన్నది అతని కోరిక. అతని స్నేహితుడు కేశవ్ (ప్రసన్న) వృద్ధిలోకి రావడానికి చెడు మార్గాన్ని ఎంచుకుంటాడు. దేశద్రోహులతో చేతులు కలుపుతాడు. డి.ఆర్.డి.ఓ కనిపెట్టిన ‘ఆక్టోపస్’ అనే ఓ పవర్ఫుల్ మిస్సైల్ ను దొంగిలించి ఇవ్వడానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న జై వారి ప్రణాలికను ఛేదిస్తాడు. జై కుటుంబానికి కేశవ్ నుండి ముప్పు ఉండడం తో, అతను దేశంతో బాటు కుటుంబాన్ని కూడా కాపాడుకొనే పనిలో పడతాడు.
రివ్యూ:
జవాన్ దేశభక్తిని ప్రభోదించే చిత్రం. హీరో పాత్ర మలచిన తీరు యువతకు చాలా స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. కథనం చాలా సాదా సీదాగా పెద్దగా మలుపులు లేకుండా సాగుతుంది. టైం వేస్ట్ చేయకుండా కథలోకి మొదటి సీన్లోనే వెళ్ళిపోతాడు దర్శకుడు. ప్రథమార్ధం హీరో, విల్లన్ ల పాత్రలను పరిచయం చేయడం, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ వంటి సన్నివేశాలతో సరదాగా సాగినా ఇంటర్వెల్ నుండి ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్థంలో హీరో విల్లన్ ల మధ్య మైండ్ గేమ్ కు పెద్దపీట వేశారు. అనవసరమైన కామెడీ ఇరికించకుండా నిజాయితీగా దేశభక్తి ప్రధానంగా చిత్రాన్ని తీసినందుకు అభినందించాలి.
తారాబలం:
సాయి ధరమ్ తేజ్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అతని కెరీర్ లో ఇది బెస్ట్ అవుతుంది. క్లిష్టమైన డ్యాన్సులు చాలా అవలీలగా చేసాడు. ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండించాడు. మెహ్రీన్ చాలా అందంగా కనిపించింది కానీ నటనకు ప్రాధాన్యం లేని పాత్రా ఆమెది. విల్లన్ గా ప్రసన్న చాలా చక్కగా చేసాడు, తెలుగు లో మరిన్ని అవకాశాలు రావడం కాయం.
సాంకేతికత:
తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్. బాక్గ్రౌండ్ స్కోర్ చిత్రంలోని థ్రిల్ ను మరింత ఎలివేట్ చేసింది. పాటలుకూడా అంతే బాగున్నాయి. గుహన్ ఛాయాగ్రహం మరో ప్లస్ పాయింట్.
చివరి మాట : జవాన్ దేశభక్తి నిండిన యాక్షన్ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here