45 దియోట‌ర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఐరా క్రియోష‌న్స్ యునానిమస్ 2018 బ్లాక్ బస్టర్ "ఛ‌లో "


నాగ‌సౌర్య హీరోగా, ర‌ష్మిక హీరోయిన్‌గా వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ స‌మ‌ర్ప‌ణ‌లో, ఉష నిర్మాతగా నిర్మించిన చిత్రం ఛ‌లో.. ఈ చిత్రం విడుద‌లయ్యిన మెద‌టి రోజునుండి ప్రేక్ష‌కులు, పాత్రికేయులు, విమ‌ర్శ‌కుల నుండి ప్ర‌శంలతో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే.
ఈ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్ర‌శంశ‌లు అందుకున్న ఈచిత్రానికి మెద‌టినుండి హ్రుద‌య‌పూర్వ‌కంగా స‌పోర్ట్ చేస్తున్న మీడియా ఫ్రెండ్స్ అంద‌రికి మెద‌టిగా యూనిట్ ధ‌న్య‌వాదాలు తెలిపుతున్నారు. ఈ చిత్రాన్ని సూప‌ర్‌హిట్ నుండి బ్లాక్‌బ‌స్ట‌ర్ కి తీసుకువెళ్ళి ఈ నెల మార్చి 23 నాటికి 50 రోజులు 45 దియోట‌ర్స్ లో న‌డిపించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి మా ప్ర‌త్యేఖ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పాటు సాటిలైట్‌, రీమెక్ రైట్స్ అంటూ క్రేజీ బిజినెస్ డీల్స్ తో 2018 బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో రికార్డ్ క్రియేట్ చేసింది ఛలో.
ఈ సంద‌ర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. ఐరా క్రియేషన్స్ తొలి ప్రయత్నంగా మొదలు పెట్టిన ఛలో ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్ర‌తి ఓక్క‌రికి మా చిత్ర యూనిట్ త‌రుపున ద‌న్య‌వాదాలు. ఈ చిత్రం దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఐరా క్రియేషన్స్ రుణపడి వుంటుంది.
మా ఐరాక్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో మెదటి ద‌ర్శ‌కుడుగా పనిచేసి ఈ ఘ‌న‌విజ‌యాన్ని అందించిన ద‌ర్శ‌కుడు వెంకి కి మరింత భ‌విష్య‌త్తు వుండాల‌ని కొరుకుంటున్నాము. తెలుగు ప్రేక్ష‌కుల అందించిన ఉత్సాహంతో ఇటీవలే ఉగాది సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ @నర్తనశాల చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాము. ఈ చిత్రం కూడా ఛ‌లో చిత్రానికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా నిర్మిస్తాము..
అతి త్వ‌ర‌లో ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తాము. అలాగే మ ఛ‌లో చిత్రానికి ప‌నిచేసిన మ్యూజిక్ ద‌ర్శ‌కుడు, ఆర్ట్ ద‌ర్శ‌కుడు, ఎడిట‌ర్ గారికి, ఫైట్ మాస్టారు, డాన్స్ మాస్టార్ , మా పి.ఆర్‌.ఓ ఏలూరు శ్రీను ఇలా పేరు పేరు నా చిత్ర యూనిట్ అంద‌రికి మా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాము. అని అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here