56 కోట్ల ఫ్లాట్ కొన్న అర్జున్ రెడ్డి..


అవునా.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అన్ని కోట్లున్నాయా..? ఆయ‌న చేసింది రెండు మూడు సినిమాలే క‌దా.. అప్పుడే 56 కోట్ల‌తో ఫ్లాట్ కొనేంత డ‌బ్బు ఎక్క‌డ్నుంచి వ‌చ్చింది..? అది కూడా ముంబైలో.. ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? ఈ అనుమానం రావ‌డం స‌హ‌జ‌మే.. ఎందుకంటే అర్జున్ రెడ్డి అన‌గానే మ‌న‌కు మ‌రో ఆలోచ‌న లేకుండా గుర్తొచ్చే హీరో విజ‌య్ కాబ‌ట్టి. కానీ ఇక్క‌డ మ‌నం మాట్లాడుకుంటున్న‌ది హిందీ అర్జున్ రెడ్డి గురించి.
అంటే షాహిద్ క‌పూర్ గురించి. ఈయ‌న ముంబైలోని ట‌వ‌ర్ బి ఆఫ్ 360 వెస్ట్ లో 43వ అంత‌స్థులోని 8625 చ‌ద‌ర‌పు అడుగులున్న ఓ ఫ్లాట్ కొన్నాడు. దీని విలువ అక్ష‌రాలా 56 కోట్లు. ఫ్లాట్ తీసుకుని త‌న‌కు కావాల్సిన‌ట్లుగా మార్చుకుంటున్నాడు ఈ హీరో. త‌న భార్య మీరా రాజ్ పుత్ కు ఈ ఫ్లాట్ ను బ‌హుమ‌తిగా ఇచ్చాడు ఈ హీరో. ఆ మ‌ధ్య వ‌ర‌స ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డినా.. రెండు మూడేళ్లుగా మ‌ళ్లీ పుంజుకున్నాడు షాహిద్. మ‌రీ ముఖ్యంగా ప‌ద్మావ‌త్ లాంటి సినిమాల‌తో ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో న‌టిస్తున్నాడు ఈ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here