8 నెలల చిన్నారి పై కామాందుడు ఘాతూక చర్య


దేశం ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎవరికి అర్ధం కావట్లేదు, రాక్షస రాజ్యం లో బ్రతుకుతున్నామా అన్నట్లు ఉంది పరిస్థితి. రాక్షసులు కుడా ఇలాంటి పని చేయరు కావచ్చు. కానీ ఢిల్లీ లో రక్షశ చర్య జరిగింది. ఢిల్లీ లో నేతాజీ సుభాష్ ప్లేస్ లో 8 నెలల పసికందు పై బలాత్కరం జరిగింది. తల్లితండ్రులు ఒక గంట పాటు బయటకి వెళ్తూ అదే బిల్డింగ్ లో ఉంటున్న స్నేహితురాలికి ఇవ్వగా అప్పుడే వచ్చిన 28 వయసు గల ఓ బిడ్డకి తండ్రి చిన్నారి పై బలాత్కరం చేసాడు. తల్లి ఇంటికి వచ్చేసరికి చిన్నారి రక్తపు మడుగులో ఉండడం చూసి హాస్పిటల్ లో జేర్చగా, డాక్టర్లు చిన్నారి రేప్ కి గురైనట్టు తెలిపారు. డాక్టర్లు 3 గంటల నిరంతర సర్జరీ చేసి చిన్నారిని కాపాడారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీస్కుంటున్న ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వీటికి ఇంకా కఠిన శిక్షలు అమలు చేయాలి అని వివిధ సంఘాలు వాలు గళంఎత్తుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here