ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రివ్యూ

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date
20190109

Critic Reviews for The Boxtrolls

రివ్యూ: ఎన్టీఆర్ కథానాయకుడు
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, రాజా దగ్గుపాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: బాబా
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి
రచన-దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

క‌థానాయ‌కుడు.. కొన్ని రోజుల నుంచి ఇండ‌స్ట్రీలో ఈ టాపిక్ త‌ప్ప మ‌రో సినిమా లేదు. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. మ‌రి ముందు నుంచి ఊహించుకుంటున్న‌ట్లే ఈ చిత్రం అంచ‌నాలు అందుకుంటుందా..? ఎన్టీఆర్ జీవితం ఎలా ఉంది..?

క‌థ‌:

1947లో నందమూరి తారక రామారావు ప్రభుత్వ ఆఫీసులో సబ్ రిజిస్టార్ గా పనిచేస్తుంటాడు. అయితే అక్కడ జరిగే అన్యాయాలు లంచాలు తీసుకోవడం ఆయనకు నచ్చక ఉద్యోగం వదిలేస్తారు. మద్రాసు వచ్చి సినిమాల్లో చేరతాడు. l v ప్రసాద్ మనదేశం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నందమూరి తారక రామారావు.. ఆ తర్వాత వరుసగా విజయాలు అందుకని వెండితెర ఇలవేల్పుగా మారతాడు. ఎన్టీఆర్ అన్ని సాఫీగా జరిగిపోతున్న సమయంలో దివిసీమ ఉప్పెన ఆయనలో మార్పు తీసుకువచ్చి ప్రజల కష్టాలు తీర్చాలని రాజకీయాల వైపు అడుగు వేస్తాడు. తెలుగుదేశం పార్టీని స్థాపించాడు ఆ తర్వాత ఏంటి అనేది మహా నాయకుడు కథ..

క‌థ‌నం:

ఎన్టీఆర్ జీవితం అంటేనే ప్రేక్ష‌కులకు క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఫార్ములా. ఆయ‌న చేసిన సినిమాలు.. ఎన్నో వంద‌ల పాత్ర‌లు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌దిలో అలా నిలిచిపోయాయి. అలాంటి మ‌హానుభావుడి సినిమాను తెర‌పై ఆవిష్క‌రించ‌డం అంటే మాట‌లు కాదు. ఈ విష‌యంలో క్రిష్ చాలా వ‌ర‌కు విజ‌యం సాధించాడు. ఈయ‌న సినిమా జీవితాన్ని అద్భుతంగా స్క్రీన్ పై చూపించాడు. చాలా వ‌ర‌కు ఎన్టీఆర్ న‌టించిన సినిమాల‌ను తీసుకుని వాటిని బాల‌య్య‌తో రీ క్రియేట్ చేసి.. అభిమానుల‌కు నాటి జ్ఞాప‌కాలు గుర్తు చేసాడు క్రిష్‌. ఇక సినిమా అంతా పూర్తిగా 40 నుంచి 70వ ద‌శకం మ‌ధ్య‌లోనే న‌డుస్తుంది. నాటి ఫీల్ తీసుకొచ్చేందుకు మేక‌ప్ టీంతో పాటు ఆర్ట్ డైరెక్ష‌న్ టీం కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమాలో వ‌చ్చే ప్ర‌తీ సీన్ విష‌యంలోనూ అద్భుతమైన ప‌నితీరు క‌నిపించింది. ముఖ్యంగా నాటి సంఘ‌ట‌న‌ల‌ను సినిమాలో చాలా బాగా చూపించాడు క్రిష్. దానికితోడు ఎన్టీఆర్ ఉద్యోగం వ‌దిలేసి మ‌ద్రాసు రావ‌డం ద‌గ్గ‌ర్నుంచి సినిమా అవ‌కాశాల కోసం చూడ‌టం.. మ‌న‌దేశం సినిమాలో అవ‌కాశం.. అక్క‌డ్నుంచి వెన‌క్కి తిరిగి చూసుకోకుండా సాగిన ప్ర‌యాణం అద్భుతం.. అద్వితీయం. ఇవ‌న్నీ సినిమాలో చాలా బాగా చూపించాడు ద‌ర్శ‌కుడు క్రిష్. అయితే స్క్రీన్ ప్లే కాస్త నెమ్మ‌దిగా సాగ‌డం ఒక్క‌టే సినిమాకు మైన‌స్. దానికితోడు చాలాచోట్ల మ‌హాన‌టి సినిమా ఫార్మాట్ క‌నిపించింది. అక్క‌డ నుంచి ఇక్క‌డ సీన్స్ రిపీట్ అయిన‌ట్లు క‌నిపించాయి. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు కారెక్ట‌ర్స్ ఇంట్రో కోస‌మే ఎక్కువ స‌మ‌యం తీసుకున్నాడు క్రిష్. ఒక్క‌సారి సెకండాఫ్ లోకి క‌థ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత అస‌లు క్రిష్ బ‌య‌టికి వ‌చ్చాడు. స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ వ‌ర‌కు సినిమాను ప‌రుగులు పెట్టించాడు. దివిసీమ ఎపిసోడ్ తో పాటు సినిమాలో మ‌రిన్ని ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ బాగా చిత్రీక‌రించాడు క్రిష్. ఓవ‌రాల్ గా ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఊహించినంత అద్భుతం కాక‌పోయినా కూడా అన్న‌గారి జీవితాన్ని అందంగా చూపించారు.

న‌టీన‌టులు:

అన్న‌గారి పాత్ర‌లో అద్భుతంగా ఒదిగిపోయాడు బాల‌య్య‌. కాక‌పోతే కొన్ని గెట‌ప్స్ మాత్ర‌మే బాల‌య్య‌కు బాగా సూట్ అయ్యాయి. న‌ట‌న ప‌రంగా నాన్న‌ను గుర్తు చేసాడు బాల‌కృష్ణ‌. ఆయ‌న్ని అనుక‌రించ‌డ‌మే కాబ‌ట్టి ఈజీగానే చేసాడు బాల‌య్య‌. ఈయ‌న త‌ర్వాత బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ మంచి మార్కులు అందుకుంది. భ‌ర్త‌కు అన్ని విధాల స‌పోర్ట్ గా ఉండే భార్య పాత్ర‌కు ప్రాణం పోసింది ఈమె. అక్కినేని పాత్ర‌లో జీవించేసాడు సుమంత్. తాత‌ను గుర్తు చేసాడు. క‌ళ్యాణ్ రామ్ కూడా హ‌రికృష్ణ పాత్ర‌లో బాగున్నాడు. ఎన్టీఆర్ జీవితాన్ని ప్ర‌భావితం చేసిన పాత్ర‌ల్లో చాలా మంది ప్ర‌ముఖులు న‌టించారు. వాళ్లు కూడా త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం అయితే చేసారు.

టెక్నిక‌ల్ టీం:

కీర‌వాణి బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ తో సినిమా స్థాయి పెంచేసాడు. ముఖ్యంగా క‌థానాయ‌కా పాట‌తో పాటు మ‌రో రెండు పాట‌లు కూడా బాగున్నాయి. విజువ‌ల్ గా కూడా అద్భుతంగా తెర‌కెక్కించాడు క్రిష్. ఎడిటింగ్ కాస్త వీక్ అనిపించింది. మ‌రీ రెండు గంట‌ల 51 నిమిషాల నిడివి ఎక్కువైపోయింది. సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంది. సినిమా రేంజ్ పెంచేసింది. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. సాయిమాధ‌వ్ బుర్రా ప్రాణం పెట్టి రాసారు. క్రిష్ త‌న‌కు ఇచ్చిన బాధ్య‌త‌ను అద్భుతంగా నిర్వర్తించాడు. అన్న‌గారి జీవితాన్ని ఎంత‌వ‌ర‌కు న్యాయం చేయాలో అంతా చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక మ‌హానాయ‌కుడు తీసే విధానాన్ని బ‌ట్టి క్రిష్ ఎలా అన్న‌గారి బ‌యోపిక్ కు న్యాయం చేసుంటాడో అర్థం అయిపోతుంది.

చివ‌ర‌గా:

అన్న‌గారి అద్భుత‌మైన చిత్ర‌క‌థామాలిక క‌థానాయ‌కుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here