బోయపాటితో చిరంజీవి సినిమా అనుమానమే.. కారణమేంటంటే..

ఒక్క సినిమాతో ఒక్క రాత్రిలో జాతకాలు మారిపోయే ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే. హిట్ వస్తే పూలు చల్లుతారు.. ఫ్లాప్ వస్తే రాళ్లతో కొడతారు. ఈ రెండు సినిమా ఇండస్ట్రీలోనే చూస్తాం. ఇప్పుడు బోయపాటి శ్రీనుకు రెండోది జరుగుతుంది. ఇన్నాళ్లు విజయాలు అందుకున్న ఈ దర్శకుడు.. రామ్ చరణ్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. వినయ విధేయ రామ తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు స్టార్ హీరోలు. ముఖ్యంగా ఇప్పుడు కమిట్ అయిన ప్రాజెక్టుల నుంచి కూడా హీరోలు తప్పుకోవటం చర్చనీయాంశంగా మారుతోంది. .

chiranjeevi boyapati movie

ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను.. ఆ తర్వాత చిరంజీవితో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీనిపై కన్ఫర్మేషన్ కూడా చాలా రోజుల కింద వచ్చింది. గీతాఆర్ట్స్, వైజయంతి మూవీస్ ఈ సినిమాను నిర్మించాలనుకున్నాయి. ఇప్పటికే బోయపాటి.. చిరంజీవి కోసం ఒక కథ కూడా సిద్ధం చేశాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా సందిగ్ధంలో పడిపోయింది. రామ్ చరణ్ సినిమా చూసిన తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలంటే చిరంజీవి ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు. అది విజయం సాధిస్తే బోయపాటి సినిమా ఉంటుంది.. ఒకవేళ బాలయ్య సినిమా ఏదైనా తేడా కొడితే చిరంజీవితో సినిమా ఉండటం కష్టమే. మొత్తానికి ఏమైనా కూడా బాలయ్య సినిమా చిరంజీవి సినిమాను డిసైడ్ చేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here