సుకుమార్ మహేష్ సినిమా ఉందా.. ఆగిపోయిందా..

ఏమో ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అభిమానుల్లో. వంశీ పైడిపల్లి మహర్షి సినిమా తర్వాత సుకుమార్ సినిమాతో బిజీ కానున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా పై ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు. ఖచ్చితంగా ఈసారి సుకుమార్ తో సంచలన విజయం అందుకుంటారని ధీమాగా చెబుతున్నారు సూపర్ స్టార్. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన నేనొక్కడినే సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ సినిమా మాత్రం విజయం సాధించలేకపోయింది. కమర్షియల్ గా నేనొక్కడినే దారుణమైన డిజాస్టర్ అయిపోయింది. దానితో ఆ బాకీ ఇప్పుడు తీర్చుకుంటాను అంటున్నాడు సుకుమార్.

కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సుకుమార్ సినిమా ఆగిపోయింది అని తెలుస్తోంది. దానికి ప్రత్యేకంగా కారణాలు ఏమీ లేవు. సుకుమార్ చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చడం లేదని.. దాంతో మరో కొత్త కథ సిద్ధం చేయాలని సూపర్ స్టార్ కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడవి నేపథ్యంలో సూపర్ స్టార్ కోసం సుకుమార్ ఒక కథ సిద్ధం చేశాడు. అయితే ఇది మహేష్ బాబు కు పెద్దగా నచ్చలేదని.. దాని స్థానంలో మరో కథ సిద్ధం చేయాల్సిందిగా కోరాడని ప్రచారం జరుగుతోంది. అందుకే వంశీ పైడిపల్లి సినిమా తర్వాత మరో ఆరు నెలల వరకు కూడా సుకుమార్ సినిమా మొదలు కావడం కష్టమే అంటున్నారు. మరి ఈ గ్యాప్ లో వేరే దర్శకుడితో మహేష్ ఏదైనా సినిమా చేస్తాడా.. లేదంటే సుకుమార్ కోసం వేచి చూస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here