నీహారికకు పెళ్లి చేస్తా.. కులంతో పని లేదంటున్న నాగబాబు..

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పుడు వివాహం గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈయన కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. ఒకటి కొడుకు వరుణ్ తేజ్.. రెండు కూతురు నిహారిక. త్వరలోనే ఈ పెళ్లిళ్ల ముచ్చట తీర్చేస్తానంటున్నాడు నాగబాబు. అందులో ముఖ్యంగా నిహారిక గురించి మాట్లాడాడు ఈ మెగా హీరో. నిహారిక నటనలోకి వస్తానని అడిగినప్పుడు పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదని.. అవసరమా అని మాత్రమే అడిగాను అంటున్నాడు నాగబాబు.తాను మొండిగా నటిస్తానని పట్టు పట్టేసరికి ఓకే అని చెప్పాను అంటున్నాడు ఈ మెగా బ్రదర్. వెబ్ సిరీస్ లో ఉన్నాయి కదా నీ ఇష్టం అంటూ ఆమెకు వదిలేసినట్లు చెప్పాడు నాగబాబు.

niharika

సినిమాలు కూడా ఆమెకే వదిలేసాను అంటున్నాడు ఈ మెగా నటుడు. ఇదిలా ఉంటే నిహారిక పెళ్లి విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. రెండు మూడేళ్లలో నీకు పెళ్లి చేస్తానని.. ఇదివరకే నీహారికకు చెప్పానని ఇప్పుడు ఆ టైం పూర్తయిపోయింది అంటున్నాడు నాగబాబు. వీలైనంత త్వరగా నిహారిక పెళ్లి చేస్తానంటున్నాడు. తమకు కులం పట్టింపులు లేవని.. మంచి అబ్బాయి అయితే చాలు అని చెబుతున్నాడు నాగబాబు. తమ కులంలో అలాంటి వాడు దొరికితే మంచిది.. లేదంటే బయటి నుంచి వచ్చినా కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటున్నాడు. అన్ని కులాలను గౌరవించాలని చెబుతున్నాడు నాగబాబు. ఈయన మాట తీరు చూస్తుంటే త్వరలోనే నిహారిక పెళ్లి కూతురు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here