నిత్యా మీనన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా నిత్యామీనన్ కు అభిమానులున్నారు. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. దానికి తోడు బరువు కూడా బాగా పెరిగిపోయి ఆంటీలా మారిపోయింది నిత్యామీనన్. దాంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు కుర్ర హీరోలతో నటిస్తే చూడలేకపోతున్నారు అభిమానులు. దాంతో ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతుంది.
ఆన్ లైన్ లో సంచలనాలు సృష్టిస్తున్న వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ కూడా నటించబోతోంది. అది కూడా మలయాళం, తెలుగు భాషల్లో కాదు.. హిందీలో ఈమె నటించబోతుంది. అభిషేక్ బచ్చన్ తో అవకాశం అందుకుంది నిత్యామీనన్. ఈయన ప్రధాన పాత్రలో వస్తున్న బ్రీత్ సీజన్ 2 లో నటించబోతోంది నిత్య. డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తుందని.. తన సినిమాలు ఇప్పటికీ హిందీలో చాలా వరకు డబ్ అయినందుకు సంతోషంగా ఉంటుంది నిత్యామీనన్. అలా డబ్ అయ్యాయి కాబట్టే తనకు హిందీ ఇండస్ట్రీ కొత్తగా ఏమీ అనిపించడం లేదని.. చాలా సింపుల్ గా ఉంది అంటుంది నిత్యామీనన్. మరి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన ఈ బొద్దుగుమ్మ వెబ్ సిరీస్ లో ఎంతవరకు మాయ చేస్తుందో చూడాలి.