పాపం.. రకుల్ ప్రీత్ సింగ్ కు కెరీర్ కోసం తప్పట్లేదు..

ఎలా మొదలు పెట్టాలని కాదు.. ఎలా పూర్తి చేస్తున్నామనేది ఇంపార్టెంట్. చిన్న హీరోలతో కెరీర్ మొదలు పెట్టినా కూడా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితోను జోడీ కట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ముఖ్యంగా బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా స్టార్ హీరోల నుంచి పిలుపు వచ్చింది. రెండేళ్ల గ్యాప్ లోనే స్టార్ హీరోలు అందరితోనూ జోడీ కట్టి నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే స్పైడర్ సినిమా తర్వాత మళ్లీ ఏ స్టార్ హీరో కూడా రకుల్ ప్రీత్ సింగ్ వైపు చూడటం లేదు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు రకుల్ ప్రీత్ సింగ్. కథానాయకుడు సినిమాలో శ్రీదేవి పాత్రలో కనిపించింది.

ప్రస్తుతం తమిళ, హిందీ ఇండస్ట్రీలపై దృష్టి పెడుతున్న రకుల్. మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు రావాలని చూస్తుంది. అందుకే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తన కెరీర్ కాపాడుకోవాలంటే కుర్ర హీరోలతో మాత్రమే నటిస్తానని మడి కట్టుకొని కూర్చోవాలనుకోవడం పక్కన పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇక నుంచి అవకాశం వస్తే సీనియర్ హీరోలతో కూడా నటిస్తానంటోంది. అందులో భాగంగానే బోయపాటి, బాలకృష్ణ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది నిజం అయితే బాలయ్యతో నటించడం వల్ల ఈమె కూడా సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోతుంది. ఆ తర్వాత కుర్రాళ్ళు అవకాశం ఇవ్వరని తెలిసినా కూడా రిస్క్ తీసుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిలబడాలంటే ఏదో ఒక పెద్ద సినిమాలో నటించాల్సిందే. ఆ పెద్ద సినిమా బాలయ్యదే అయితే తప్పు లేదనుకుంది రకుల్. మొత్తానికి ఈమె తీసుకున్న నిర్ణయం ఆమె కెరీర్ ను ఎటువైపు తిప్పుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here