రాధాకృష్ణ పై విరుచుకుపడ్డ జన సేన పార్టీ లీడర్

జన సేన పార్టీ లీడర్ దిలీప్ సుంకర ఫైర్డ్ ఆన్ ఏ.బి.ఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిలీప్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసినట్లు ఏ.బి.ఎన్ న్యూస్ ఛానల్ లో ఇటీవల వరుస కథనాలు ప్రసారంచేశారు. దిలీప్ పై చీటింగ్ కేసు ఉందని, అయన వద్ద తుపాకీ ఉందని, ఆయనో రౌడీ షీటర్ అని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారని వార్తలు వచ్చాయి. కధనం ప్రకారం ఓ.ఎల్.ఎక్స్ వెబ్సైటు లో నకిలీ ఐఫోన్ ను స్వాతి అనే టీవీ ఆంచారు కు విక్రయించారట.

janasena party leader fumed on radha krishna

అదేమిటని స్వాతి ప్రశ్నించగా తుపాకీ తో బెదిరించాడని ప్రసారం చేసారు. ఈ క్రమం లో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై మండిపడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు దిలీప్. టాస్క్ ఫోర్స్ అధికారులు ఇంటికి వచ్చిన మాట నిజమేనని, అయితే తన భార్య గర్భవతి అయివుండటం వల్ల కంగారు పడకూడదని పోలీసులను స్నేహితులుగా చెప్పి తన వద్దనున్న ఎయిర్ పిస్టల్ ను చూపానని.

రాజకీయం గా టార్గెట్ చేసి కొందరు ఫాల్స్ కేసు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వారికి వివరించానని చెప్పారు ఆయన. రాధాకృష్ణ కుల పిచ్చి ఉన్న వ్యక్తి అని, అతను ఓ పార్టీకి కొమ్ముకాస్తున్నాడని, వేరే క్యాస్ట్ వారు ఎదిగితే తట్టుకోలేదని తీవ్ర పదజాలం తో దూషించారు దిలీప్. ఆంధ్రజ్యోతి వారు బాలకృష్ణ ఇంటిలో కాల్పుల కలకలం అని హెడ్డింగ్ పెట్టారు తప్ప బాలయ్య కాల్చారు అని రాయలేపోయారని, అయితే తనవద్ద డమ్మీ తుపాకీ ఉంటె రౌడీ షీటర్ అని పోలీసులు వలవేసి పట్టుకున్నారని ఇష్టమొచ్చినట్లు రాసారని ఆవేదన వ్యక్తపరిచారు దిలీప్.