యాత్ర సినిమా ఎలా ఉంది.. ఓవర్సీస్ టాక్ ఎలా వచ్చింది..

మమ్ముట్టి హీరోగా మహీ రాఘవ తెరకెక్కించిన యాత్ర సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ నుంచి ఈ చిత్రానికి ఊహించిన టాక్ రాలేదు. సినిమా కాస్త స్లో గా ఉందనే కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ జీవితం గురించి తెలుసుకోవడానికి కొత్త విషయాలు పెద్దగా ఏమీ లేవు.. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. దానికితోడు పాదయాత్ర ఎందుకు చేశారనేది కూడా చాలా మందికి తెలుసు. కేవలం ఇది మాత్రమే సినిమాలో చూపించడంతో సినిమా అనుకున్నంత వేగంగా లేదని తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్ అంతా వైఎస్సార్ పాదయాత్ర సీన్స్ తోనే సాగిపోతుందని.. సెకండాఫ్ కాస్త ఎమోషనల్ గా దర్శకుడు డీల్ చేసాడని తెలుస్తోంది. క్లైమాక్స్ సినిమాకు ప్రాణంగా నిలిచిందని.. ముఖ్యంగా చివర్లో 10 నిమిషాల పాటు వైఎస్సార్ ఒరిజినల్ విజువల్స్ చేసి అభిమానులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని తెలుస్తోంది. ఓవరాల్ గా యాత్ర సినిమా వైయస్సార్ అభిమానులకు పండగలా ఉన్నా సాధారణ ప్రేక్షకులకు మాత్రం జస్ట్ ఓకే అనిపించేలా ఉందని ప్రచారం జరుగుతుంది. దానికి తోడు మమ్ముట్టి కూడా వైయస్సార్ పాత్రలో అద్భుతంగా నటించాడు. మొత్తానికి కథానాయకుడు ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఇప్పుడు యాత్ర సినిమా ఏమవుతుందా అని ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here