ఆసక్తి రేపుతున్న `రాజుగాడు` ఫ‌స్ట్‌లుక్

యువకథానాయకుడు రాజ్‌తరుణ్ న‌టిస్తోన్న డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజుగాడు`. వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న రాజ్ త‌రుణ్ …త‌న‌కు వ‌రుస విజ‌యాల‌ను అందించిన నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై న‌టిస్తోన్న చిత్రం `రాజుగాడు`. రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన ‘ఈడోరకం-ఆడోరకం’, ‘కిట్టుఉన్నాడుజాగ్రత్త’, ‘అంధగాడు’ సినిమాతో హ్యాట్రిక్‌ హీరోగా నిలిచారు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌త‌రుణ్ చేస్తోన్ననాలుగో చిత్రమిది, సంజనా రెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా ద‌స్తుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఒక‌ప‌క్క ల‌వ‌ర్ అయిన అమైరా ద‌స్తుర్‌ను కౌగిలించుకుంటూనే ఆమె హ్యాండ్ బ్యాగ్ నుండి సెల్‌ఫోన్ కొట్టేయ‌డం ఈ ఫ‌స్ట్‌లుక్‌లో క‌న‌ప‌డుతుంది. ఈ ఫ‌స్ట్‌లుక్ అస‌లు హీరో రాజ్‌త‌రుణ్ ఎలాంటి క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌నున్నాడోన‌ని ఆస‌క్తిని రేపుతుంది.  కామెడీ, లవ్‌, యాక్షన్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న ఎంటర్‌టైనర్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, రావు ర‌మేష్‌గారు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పుడు పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గుతుంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత‌లు. `రాజుగాడు` చిత్రంతో రాజ్‌త‌రుణ్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బేన‌ర్‌లో నాలుగో హిట్‌ను సాధించాల‌ని కోరుకుందాం.