ఊపిరి పీల్చుకో తెలంగాణ బాహుబలి రెడ్డి వచ్చాడు!

తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి చేరడంతో కుల రాజకీయాలు వేడెక్కాయి.

Revanth Reddy Is Baahubali Of Congress

 

రేవంత్ టీడీపీ టీ.ఆర్.ఎస్ లు పొత్తు దిశగా వెళ్తున్నాయని అభియోగించారు. అదే జరిగితే 2019 ఎలక్షన్ లలో టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ ల  మధ్య మాత్రమే పోటీ ఉండబోతుంది. సామజిక వర్గాల ప్రకారం పార్టీలు వెలమ, కమ్మ మరియు రెడ్డి కులాల ఆధిక్యత ఉన్న మాట వేరే చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు వెలమ కమ్మ కలిసి రెడ్ల పై దండయాత్రకు సిద్దపడినట్లుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. రేవంత్ రెడ్డి సామజిక వర్గాన్ని ఏకధాటి మీదకు తెచ్చి కెసిఆర్ కు వ్యతిరేక నినాదాన్ని బలం గా వినిపించనున్నారని అనుకుంటున్నారు. కాంగ్రెస్ నీరస పడటం తో రెడ్డి వర్గం వారి బలం కూడా తగ్గినట్లయింది.

వారి సంఖ్య కూడా తక్కువుండటం మరో నెగటివ్ పాయింట్. రాజకీయాలలో వారి ఆధిపత్యం తగ్గిపోతుందని భయపడటం వల్లే రేవంత్ ను రంగం లోకి దింపి అత్యవసర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని విశ్లేషణ. అందుకే రేవంత్ ను జానా రెడ్డి బాహుబలి తో పోల్చారు.  మరో వైపు ప్రొఫెసర్ కోదండరాం కు కెసిఆర్ పై రగడ మొదలుపెట్టడం తో టి ఆర్ ఎస్ కు కంఠకం గా మారింది.