ఎన్టీఆర్, నాని తో అయితే చేస్తానంటున్న హీరో అయిన నిరుద్యోగి!

సాయి ధరమ్ తేజ్ ఆదివారం నాడు పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న జవాన్ చిత్ర పాటను విడుదల చేసారు కూడా. మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బి వి ఎస్ రవి దర్శకుడు. సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చాల ఆసక్తి కార విషయాలు చెప్పారు. తనకు నాని మరియు ఎన్టీఆర్ తో మల్టిస్టార్రర్ చేయాలనివుందని చెప్పారు. చిరంజీవి రౌడీ అల్లుడు చిత్రం రీమేక్ చేస్తారా అని అడుగగా, సాయి ధరమ్ పాటలను రీమిక్స్ చేస్తేనే తిడుతున్నారు ఇక మెగా స్టార్ చిత్రాల జోలికి వెళ్తే ఇక ఫాన్స్ బాండ బూతులు తిడతారని చమత్కరించారు. సినిమా హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది అన్న ప్రశ్నకు సుప్రీమ్ హీరో నిరుద్యోగి గా ఉన్న తనకు నటుడు అవ్వడం ఒక్కటే గతి అనిపించింది అన్నారు. జవాన్ తర్వాత సాయి ధరమ్ వి వి వినాయక్ తో జత కట్టనున్నారు.