ఎన్టీఆర్ బ‌యోపిక్ కు క‌ష్టాలు..


ఏ ముహూర్తంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తాన‌ని చెప్పాడో బాల‌య్య కానీ అప్ప‌ట్నుంచీ అన్నీ అడ్డంకులే వ‌స్తున్నాయి. స్టార్ డైరెక్ట‌ర్.. హీరో.. భారీ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్.. ఇలా అన్నీ ఉన్నా కూడా ఎందుకో తెలియ‌దు కానీ ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆల‌స్యం అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఇందులో న‌టీన‌టుల ఎంపిక ఇప్పుడు క్రిష్ కు త‌ల‌నొప్పిగా మారుతుంది. ఎవ‌ర్ని ఏ పాత్ర కోసం ఎంచుకోవాలో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నాడు క్రిష్‌.
ఇప్ప‌టికే బ‌స‌వ తార‌కం పాత్ర కోసం విద్యాబాల‌న్ ను బాలీవుడ్ లో త‌నకు ఉన్న‌ పిఆర్ తో ఎలాగోలా ఒప్పించాడు క్రిష్‌. ఇక నాగేశ్వ‌ర‌రావ్ పాత్ర కోసం సుమంత్ ను తీసుకుంటున్నాడు. పోలిక‌ల విష‌యంలో తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డే ఈ అక్కినేని అల్లుడు. అందుకే ఈయ‌న వైపు మొగ్గు చూపుతున్నాడు. మ‌రొఐవ‌పు సావిత్రి పాత్ర కోసం మ‌రోసారి కీర్తిసురేష్ నే ఆశ్ర‌యిస్తున్నాడు క్రిష్‌. ఈమె త‌ప్ప ఇప్పుడు మ‌హాన‌టి పాత్రలో మ‌రో హీరోయిన్ ను ఊహించ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు.
దాంతో కాస్త క‌ష్ట‌మైనా ప‌ర్లేదు కీర్తినే ఒప్పించే ప‌నిలో ఉన్నాడు క్రిష్. వాళ్ళ‌తో పాటు మోహ‌న్ బాబును కూడా ఈ బ‌యోపిక్ లో తీసుకుంటున్నాడు క్రిష్‌. ఓ కీల‌క‌పాత్ర కోసం క‌లెక్ష‌న్ కింగ్ ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తుంది. అన్న‌య్య బ‌యోపిక్ కావ‌డంతో ఆనందంగా మోహ‌న్ బాబు ఈ పాత్ర చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని తెలుస్తుంది. అన్నీ కుదిర్తే ఆగ‌స్ట్ నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌లుకానుంది. సంక్రాంతికి విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here