ఎన్టీఆర్ భార్యగా రోజా నటిస్తుందా?


రామ్ గోపాల్ వర్మ లక్ష్మి’స్ ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించేసారట. వై.ఎస్.ఆర్.సి.పి. నేత రాకేష్ రెడ్డి ఈ బయోపిక్ ను నిర్మించనున్నారని ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్.జి.వి పలమనేరులో రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మీడియా తో మాట్లాడుతూ వర్మ… లక్ష్మీపార్వతి కోణం లో చిత్ర కథ ఉంటుందని.

ఆమె ఎన్టీఆర్ జీవితంలో అడుగు పెట్టినప్పటి నుండి ఆయన చనిపోయే వరకు జరిగిన ఎవరికీ తెలియని రహస్య సంఘటనలను చిత్రంలో చూపనున్నట్లు చెప్పారాయన. అయితే ఎవరు ఎన్టీఆర్ పాత్ర చేయబోతున్నారో ఇంకా నిర్ణయించలేదని చెప్పారు ఆర్. జి.వి.

నగరి ఎమ్మెల్యే రోజా ఈ చిత్రంలో కీలక పాత్రా చేసే అవకాశముందని వర్మ చెప్పారు. ఆమె లక్ష్మి పార్వతి పాత్ర చేస్తుందని ఫిలిం నగర్ వర్గాల గుసగుస. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టి, ఎవరి బెదిరింపులకు భయపడకుండా నిజాయితీగా జరిగిన విషయాలను ప్రజల ముందు పెట్టడమే తమ ఉద్దేశమని రాకేష్‌రెడ్డి చెప్పారు.