`ఐట‌మ్` షూటింగ్ ప్రారంభం!

ITEM--Movie-opening
సిరివెన్నెల క్రియేష‌న్స్ ప‌తాకంపై  సిరి సంప‌ద స‌మ‌ర్ప‌ణ‌లో జితేంద‌ర్, రాకేష్‌, గీతా షా హీరోహీరోయిన్లుగా  నాగ‌రాజు త‌లారి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `ఐట‌మ్‌`. ఈ  చిత్రం ప్రారంభోత్స‌వం ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఫిలింన‌గ‌ర్ టెంపుల్ లో  జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ముహూర్త‌పు స‌న్నివేశానికి  క్లాప్ నివ్వ‌గా… చిత్ర స‌మ‌ర్ప‌కులు రాఘ‌వేంద్ర  కెమెరా స్విచాన్ చేశారు.  న‌టి క‌విత గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“నాగ‌రాజు గ‌తంలో ప‌లు చిత్రాలు చేశారు. క‌థ పై చాలా రోజులు వ‌ర్క్ చేశాడు. నేను విన్నాను. క‌థ చాలా బావుంది. నాగ‌రాజుకు అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తాన‌ని మాటిచ్చాను. ఈ సినిమా ద్వారా కొత్త న‌టీన‌టులు మాత్ర‌మే కాదు, సాంకేతిక‌నిపుణుల‌ను కూడా ప‌రిచ‌యం చేస్తున్నారు. టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.
న‌టి క‌విత మాట్లాడుతూ…“కొత్తవారితో మంచి క‌థ ఎన్నుకుని నాగ‌రాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స‌బ్జెక్ట్ బావుంటే చిన్న‌, పెద్ద అని తేడా లేకుండా ఆద‌రిస్తున్నారు. కొత్త‌నీరు రావాలి. ఈ సినిమాలో నేను కూడా మంచి పాత్ర పోషిస్తున్నా“అన్నారు.
 చిత్ర స‌మ‌ర్ప‌కులు రాఘ‌వేంద్ర మాట్లాడుతూ…“ద‌ర్శ‌కుడు మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  మా ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు
ద‌ర్శ‌కుడు నాగ‌రాజు త‌లారి మాట్లాడుతూ…“నా సొంత బేన‌ర్ లో రూపొందిస్తున్న తొలి సినిమా ఇది. ల‌వ్ అండ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ కి హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్  జోడించాము. డిసెంబ‌ర్ 20న తొలి షెడ్యూల్ ప్రారంభించి  జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు చేస్తాము. సెకండ్ షెడ్యూల్ మార్చి ఎండింగ్ లో ప్లాన్ చేస్తున్నాం. మా హీరోయిన్ గీతా షా గ‌తంలో  వైర‌స్ మూవీలో న‌టించింది మ‌రో సినిమా కూడా చేస్తోంది. ఇది మూడ‌వ సినిమా.  జితేంద‌ర్, రాకేష్ ల‌ను ఈ చిత్రం ద్వారా  హీరోలుగా ప‌రిచ‌యం చేస్తున్నాం. ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌గా నాకు మంచి పేరు తె స్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాను“ అన్నారు.
హీరో జితేంద‌ర్  మాట్లాడుతూ…“` మాది బెంగుళూరు. సినిమాల్లో న‌టించాల‌న్న‌ది నా కోరిక‌. ఇందులో హీరోగా అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌కు ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
 హీరోయిన్ గీతా షా మాట్లాడుతూ…“ఈ సినిమాలో న‌టించ‌డం హ్యాపీ. ఇందులో ఛాలెంజింగ్ రోల్ న‌టిస్తున్నా“అన్నారు.
 మ‌రో హీరో రాకేష్ మాట్లాడుతూ…“ ఇది నా ఫ‌స్ట్ ఫిలిం. మూవీలో మంచి మెసేజ్ తో పాటు ఎంట‌ర్ టైన్మెంట్ కూడా ఉంది“అన్నారు.
 కెమెరామేన్ ర‌వి బైప‌ల్లి  మాట్లాడుతూ…“నాగ‌రాజు గారి డైర‌క్ష‌న్ లో ఇది నా మూడ‌వ సినిమా. త‌నతో వ‌ర్క్ చేయ‌డం చాలా బావుంటుంది“ అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here