కొటీ కి పైగా పలికిన సువర్ణసుందరి హిందీ శాటిలైట్ రైట్స్

ఒక వైపు విజువల్ షో  మరోపక్క థ్రిల్లింగ్ సబ్స్టెన్స్.. ఈ రెండు అంశాలను బ్యాలెన్స్ చెసుకుంటూ ఓ చారిత్రాత్మక సినిమాను ,ఫాంటసీని  నిర్మించాలంటే ఆషామాషీ విషయం కాదు. హిస్టారికల్ చిత్రాల  సక్సెస్ విషయంలొ ఇవే కీలకంగా మారాయి. తాజాగా  “సువర్ణసుందరి” టీజర్ చూస్తుంటే   విజువల్ గా, కంటెంట్ పరంగా క్వాలిటీ మూవీగా కన్పిస్తొంది.
Suvarna Sundari Hindi Satellite Rights Sold Out For 1 Cr
జయప్రద,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న ఈ సినిమాను ఓ హిస్టారికల్ అడ్వెంచర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో అంతే ఇంట్రెస్టింగ్ టీజర్ తో సువర్ణ సుందరి ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.  విడుదలైన రోజు నుంచె సోషల్  మీడియాలో వైరల్ గా మారిన ఈ టీజర్ వన్ మిలియన్ డిజిటల్ వ్యూస్ ను క్రాస్ చేసింది.
ఇక డిజిటల్, శాటిలైట్స్ విషయంలో సువర్ణ సుందరి మంచి ఆఫర్స్ ను రాబట్టుకొగలిగింది. హిందీ శాటిలైట్ రైట్స్ కొటీ కి పైగా పలకగా, బారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపొని విధంగా, ఎలాంటి క్యాలుక్యులేషన్స్ ను, పరిమితులను విధించు కొకుండా ఓ  సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తొన్న ఈ చిత్రం అతి త్వరలొనె ప్రేక్షకుల ముందుకు రానుంది.
 జయప్రద,పూర్ణ,  సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి.