గౌర‌వప్ర‌ద‌మైన అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో  అవార్డు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్ర‌తిష్టాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు మెగాస్టార్ కు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి సంతోషం వ్య‌క్తం చేశారు.
Chiranjeevi thanks for Raghupati Venkaiah award
`ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డుకు క‌మిటీ న‌న్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ గొప్ప వ్య‌క్తి పేరిట నెల‌కొల్పిన అవార్డు 2016 ఏడాదికి గాను న‌న్ను ఎంపిక చేసినందుకు ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి..జ్యూరికి నా కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మిగ‌తా విజేత‌ల‌కు నా అభినంద‌న‌లు` అని అన్నారు.