డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల విధి విధానాల‌పై స‌మావేశ‌మైన ద‌క్షిణాది ఫిల్మ్ ఛాంబ‌ర్స్

తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి  అధ్య‌క్షులు పి. కిర‌ణ్, సెక్ర‌ట‌రీలు ఎమ్ . రామ‌దాసు, కె. శివ‌ప్ర‌సాద‌రావు, తెలంగాణ రాష్ర్ట ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు కె. ముర‌ళీ మోహ‌న్, సెక్ర‌టరీ సునీల్ నారంగ్ , ద‌క్షిణాది ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు ఎల్. సురేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ శ్రీ రవి కొట్ట‌రాక‌ర‌, త‌మిళ సినిమా నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ కృష్ణ‌, సెక్ర‌ట‌రీ కతీర్ సేన్, క‌ర్ణాట‌క ఫిలిం ఛాంబ‌ర్ సెక్ర‌ట‌రీ  ఎన్.ఎమ్ సురేష్‌, కెర‌ళ ఫిలిఛాంబ‌ర్ అధ్య‌క్షులు కె. విజ‌య్ కుమార్, కేర‌ళ ఫిలిం డిస్ర్ట్యిబ్యూష‌న్ సంఘం  అధ్య‌క్షులు సియ్యాద్ కొక్కెర‌,  కేర‌ళ ఫిలిం నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షులు జి. సురేష్ కుమార్ , నిర్మాత‌లు, పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్లు త‌దిత‌రులు క‌లిసి  డిజిట‌ల్ స‌ర్వీసె ప్రొవైడ‌ర్స్ తీసుకుంటోన్న ఏకప‌క్ష నిర్ణ‌యాల గురించి చ‌ర్చించుట‌కు తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి కార్యాల‌యంలో 31-01-2018 నాడు అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైంది.
ఈ స‌మావేశంలో డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారు వ‌సూలు చేయుచున్న ఛార్జీల గురించి  మ‌న  సినిమా ప్ర‌తిఫ‌లం మ‌నం అందుకోకుండా ఎక్క‌డినుంచో వ‌చ్చిన‌ డిజిట‌ల్ ప్రొవైడ‌ర్స్ అన్యాయంగా దోచుకుంటున్నార‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈస్ట్ ఇండియా కంపెనీలా త‌యారై అధికంగా డ‌బ్బు గుంజుతున్నారని అంద‌రూ ఆరోపించారు. త‌క్కువ ధ‌రకు వ‌స్తున్న‌ డిజిట‌ల్ స‌ర్వీస్  ప్రొవైడ‌ర్స్ వారిని రాకుండా ఆపేస్తున్నార‌ని స‌భ్యుల‌ద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ వారితో ఒక వారంలోగా స‌మావేశం ఏర్పాటు చేసి ధ‌ర‌ల త‌గ్గింపు ఇత‌ర‌త్ర విష‌యాల‌పై చ‌ర్చించేందుకు  నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఈ స‌మావేశంలో స‌భ్యులంద‌రూ ముక్త‌కంఠంతో ఒక వారం రోజులు లోపుగా  ఈస‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌ని యెడ‌ల మార్చి 1, 2019 వ‌తేదీ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ర్టాల‌లోని  థియేట‌ర్ల‌ను మూసివేయుట‌కు నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here