నవంబర్ 3న 300 థియేటర్స్ పైగా నాగ అన్వేష్ ” ఏంజెల్” విడుదల

 

 

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండటంతో దాదాపు నాలుగు నెలలుగా ఏంజెల్ బృందం ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం వ‌ర్క్ చేశారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకొని ఏంజెల్ ను న‌వంబ‌ర్ 3న విడుద‌ల కానున్న సంద‌ర్భంగా నిర్మాత సింధూర పువ్వ కృష్ణారెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ…   ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలు స్నో వైట్ అండ్ ద హంట్స్ మెన్, థార్, ఎవెంజర్స్ వంటి సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ఏంజెల్ విజువల్ ఎఫెక్ట్స్ ను వాడటం జరిగింది ఈ ఏంజిల్ సినిమాకు, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 8 నిముషాలు విడిది కలిగిన చిత్రం.

సినిమా మనీ కు సంబంధించి చేసినది కాదు చాలా ఆనందం గా అనిపించింది సినిమా చూసాక. ఒక సినిమా వారికి సినిమానే  బలం ఆ బలం తోనే ఏంజెల్   సినిమా చేసాము. ఇక హీరో నాగ అన్వేష్ గురుంచి చెప్పాలంటే హీరోగా చాలా మెచూర్డ్ అయ్యారు, డాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ ఇలా అన్నీ విధాలా ఫుల్ ప్లెడ్జెడ్ హీరోగా ఈ సినిమాలో కనపడతారు. ఈ చిత్ర ముఖ్య కథాశం గురుంచి ప్రస్తావిస్తే మనిషి స్వర్గం ఎక్కడో ఉంటుందని భావిస్తారు కానీ మనుషులు తిరిగే చుట్టూనే ఉంటుందని గ్రహించలేక అనవసర ఇగో లకు ఈర్ష్యాలకు పోయి కొద్దీ కాల జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు అనే కథ తో సాగుతుంది ఏంజిల్ చిత్రం. ఈ చిత్రం లో నటించిన ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారు. తప్పకుండా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా మా సరస్వతి సంస్థకు,   ఈ చిత్రాన్ని కన్నడలో  స్ట్రైక్ కారణం తో నవంబర్ మొదటి వారం  వరకు  కన్నడ సినిమాలే విడుదల కావాలనే ఉద్దేశ్యం తో తెలుగు సినిమాల విడుదల జాప్యం జరగనుంది. ఈ సినిమా అక్కడ  260 థియేటర్లలో విడుదల కానుంది.  ఇక  తమిళంలో జి ఎస్ టీ సమస్యల వలన అక్కడ కూడా జాప్యం జరుగుతుంది. తెలుగులో మాత్రం చెప్పిన టైం అంటే నవంబర్ 3న ఖచ్చితంగా విడుదల చేస్తున్నాము. సినిమా విజయం సాదిస్తుందని  చాలా కాఫిడెంట్ తో ఉన్నాము. 300 థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నాము అని తెలిపారు.