నాగ చైతన్య కి ఏం లోపం ఉంటుంది?

నాగ చైతన్య తన ప్రేమమ్ దర్శకుడు చందూ మొండేటి తో సవ్యసాచి అనే చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్నాడు చైతు. సమంత తో ఆయన వివాహం అక్టోబర్ 6 న జరగనుంది. చైతన్య మారుతీ దర్శకత్వంలో మరో చిత్రం కూడా చేయబోతున్నాడు.
భలే భలే మగాడివోయ్ లో మతిమరపు, మహానుభావుడు అతి శుభ్రత ఉన్న హీరోలను చూపిన మారుతీ నాగ చైతన్య తో తీయబోయే చిత్రంలో హీరోకి ఏ లోపం పెడతాడో అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ చిత్రం లో అలంటి కాన్సెప్ట్ ఏమి లేదట. పెళ్లి తర్వాత మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే చిన్న చిన్న ఇగో గొడవల నేపధ్యం లో ఉంటుందట కథ. మారుతీ కామెడీ టేకింగ్ చైతన్య కి మంచి హిట్ ఇవ్వాలని ఆసిద్దాం.