పంతం సెన్సార్ టాక్ ఏంటి..?


గోపీచంద్ కు ఇప్పుడు విజ‌యం త‌ప్ప‌నిస‌రిగా కావాలి. లౌక్యం వ‌చ్చి మూడేళ్లు దాటిపోయింది ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ కొట్ట‌లేదు ఈ హీరో. ఆ సినిమా 20 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి గోపీ మార్కెట్ పెంచేసింది. ఆ త‌ర్వాత జిల్.. ఆక్సీజ‌న్.. గౌత‌మ్ నందా లాంటి డిజాస్ట‌ర్లు వ‌చ్చి గోపీచంద్ ఇమేజ్ మ‌రోసారి త‌గ్గించేసాయి. ఇప్పుడు కానీ అర్జంట్ గా హిట్ కొట్ట‌క‌పోతే ఈ హీరోను మ‌రిచిపోయే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు.
ఇలాంటి టైమ్ ఈయ‌న త‌న పంతం చూపించ‌డానికి వ‌స్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి తెర‌కెక్కించిన ఈ చిత్రం జులై 5న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర సెన్సార్ పూర్త‌యింది. దీనికి యు బై ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. ఫ‌స్టాఫ్ అంతా కామెడీ ప్ల‌స్ యాక్ష‌న్ తో జ‌రుగుతుంద‌ని.. సెకండాఫ్ లో మాత్రం పూర్తిగా సందేశాన్ని ఇస్తాడ‌ని తెలుస్తుంది. ట్రైల‌ర్ చూసిన‌పుడే ఇది మెసేజ్ ఓరియెంటెడ్ అని అర్థ‌మైపోయింది.
ఇదంతా చూస్తుంటే ఈ సారేదో గ‌ట్టి పంతంతోనే వ‌స్తున్నాడు గోపీచంద్. పైగా సోష‌ల్ మెసేజ్ కూడా తీసుకొస్తున్నాడు. లంచాలు తీసుకుని.. ఓట్ల‌ను అమ్ముకుని క‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నాడు ఈ హీరో. బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ కేకే రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో గోపీచంద్ ఫామ్ లోకి వ‌స్తాడో లేదంటే మ‌రోసారి అక్క‌డే ఆగిపోతాడో..? అన్న‌ట్లు ఈ చిత్రాన్ని ముందు ర‌వితేజ‌తో ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు చ‌క్రి.. ఆయ‌న మిస్ అయ్యాడు దాంతో గోపీచంద్ వ‌ర్కవుట్ అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here