భార్యాభర్తల బెడ్‌రూం లో సీక్రెట్ కెమెరా…

భార్యాభర్తల బెడ్‌రూం దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెట్టాడు ఓ ప్రబుద్దుడు.
బెంగళూరు లోని కోరమంగల ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించే దంపతులు తమ బెడ్‌రూం దృశ్యాలు వెబ్‌సైట్‌లో చూసి అవకయ్యారట. వారు ఈ విషయాన్నీ మిత్రుల ద్వారా తెలుసుకున్నారట. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంటి యజమాని కుమారుడు అంజన్‌ దంపతులు ఇంట్లో లేని సమయంలో డూప్లికేట్‌ తాళం చెవి ద్వారా ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌రూంలో రహస్య కెమెరా అమర్చినట్లు గుర్తించారు. అలా సేకరించిన దృశ్యాలను సెక్స్ వెబ్సైటు లలో అప్‌లోడ్‌ చేశాడని నిర్దారించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.