
ఎక్కడైనా భర్తే దగ్గరుండి మరీ భార్యను గ్లామర్ షో చేయిస్తాడా.. అది ఎక్కడైనా జరుగుతుందా..? ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. అవును.. ఆ హీరోయిన్ ఎవరోకాదు.. ఆకాంక్ష సింగ్. ఈ మధ్యే మళ్లీరావా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఆకాంక్ష. ఇక్కడే వెలిగిపోవాలనేది కూడా ఆమె ఆకాంక్ష. ఆమె కోరికను ఇప్పుడు భర్త తీరుస్తున్నాడు. అసలు ఈ భామకు పెళ్లైన విషయం ఆమె చెప్పే వరకు కూడా తెలియదు. 2013లోనే తన బాయ్ ఫ్రెండ్ కునాల్ సైన్ తో ఏడడుగులు నడిచింది ఆకాంక్ష సింగ్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది ఈ భామ. తన కెరీర్ కు భర్తే దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెబుతుంది ఆకాంక్ష. ఇక ఈ మధ్యే అదిరిపోయే హాట్ హాట్ షో ఒకటి చేసింది ఈ భామ. దీనికి కూడా భర్త నుంచి పర్మిషన్ వచ్చిందని చెబుతూ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ రావా తర్వాత తెలుగులో మరో అవకాశం కోసం చూస్తుంది ఈ భామ. మరి ఈమె కోరికను మన్నించి ఆకాంక్ష ఆకాంక్షను ఏ దర్శకుడు తీరుస్తాడో చూడాలిక..!

