యూత్ అండ్ మాస్ ఆడియెన్స్‌ను అకట్టుకుంటున్న `టింగ టింగ టింగ‌రా…` సాంగ్‌

తెలుగు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. ప్ర‌స్తుత తెలుగు సినిమాల్లో త‌ప్ప‌నిస‌రిగా ఓ స్పెష‌ల్ సాంగ్ ఉండేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఈ స్పెష‌ల్ సాంగ్స్‌లో అడ‌పాద‌డ‌పా స్టార్ హీరోయిన్స్, బాలీవుడ్ భామ‌లు న‌ర్తిస్తుండ‌టం విశేషం. స్పెష‌ల్ సాంగ్ అంటే..కేవలం తెలుగు ప‌దాల‌కే ప‌రిమితం కాకుండా, సాహిత్యంలో హిందీ ప‌దాల‌ను కూడా మిక్స్ చేసి రాయ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.
ట్రెండ్‌కు అనుగుణంగా యూత్‌, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునే స్పెష‌ల్ సాంగ్స్‌లో  అక్క‌డ‌క్క‌డా హిందీ పదాలుంటాయి. కానీ పూర్తి స్థాయి హిందీ పాట‌ను తెలుగులో స్పెష‌ల్ సాంగ్ గా పెట్ట‌డ‌మ‌నేది చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది.
2001లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `ఖుషీ` చిత్రంలో `ఏ మేరా జ‌హ‌..` అనే  సాంగ్ పూర్తిస్థాయి హిందీ సాహిత్యంతో ఉంటుంది. అప్ప‌ట్లో ఈ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాంటి పూర్తిస్థాయి హిందీ పాట‌నే ఇప్పుడు  మనం `ఖాకి` చిత్రంలో వినొచ్చు, చూడొచ్చు.
 `టింగ టింగ టింగ‌రా..` అంటూ సాగే ఈ పాట‌లో ప్ర‌ముఖ మోడ‌ల్ స్కార్లెట్ మెల్లిష్ విల‌న్స్ న‌ర్తించారు.
రిథ‌మిక్ ప‌దాల‌తో, హుషారైన బాణీతో కుర్ర‌కారును ఉర్రూత‌లూగించే ఈ పాట‌కు హ్యూజ్‌ రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర్వ‌త్రా టింగ టింగ టింగ‌రా పాట సౌండ్ చేస్తోంది. జిబ్ర‌న్ ఈ పాటపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌నే సంగ‌తి విన్న‌వారెవ‌రైనా ఇట్టే గ్ర‌హించ‌గ‌లుగుతారు. ఆడియో విన‌డానికే ఇంత హుషారుగా ఉంటే, వెండితెర‌మీద స్టెప్పుల‌తో క‌లిసి చూసే ఆడియ‌న్స్ విజిల్స్ తో ఇంకెంత హుషారును జోడిస్తారో వేచి చూడాల్సిందే.
 కార్తి, ర‌కుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా న‌టించిన `ధీర‌న్ అధిగారం ఒండ్రు` సినిమాను తెలుగులో `ఖాకి` పేరుతో విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే.  తెలుగు, త‌మిళంలో సినిమాను నవంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఓ సిన్సియ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించి ముందుకు సాగాడ‌నేదే ఈ చిత్ర క‌థాంశం. సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని `ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అధినేత  ఆదిత్యా ఉమేశ్ గుప్తా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.
కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, సంగీతం: జిబ్రాన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

Tinga Tinga Song Promo Video:

Tinga Tinga Song Lyrical Video: