రివ్యూ: ఆర్ఎక్స్ 100

CRITICS METER

Average Critics Rating: 0
Total Critics:0

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

రివ్యూ          : ఆర్ఎక్స్ 100
న‌టీన‌టులు    : కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్, రావుర‌మేష్, రాంకీ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ  : రామ్
సంగీతం        : చేత‌న్ భ‌ర‌ద్వాజ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: అజ‌య్ భూప‌తి
నిర్మాణం       : కార్తికేయ మూవీ క్రియేష‌న్స్
అర్జున్ రెడ్డి త‌ర్వాత తెలుగులో బోల్డ్ సినిమాల క్ర‌మం ఎక్కువైపోయింది. బూతు సినిమాలు తీసి కూడా బోల్డ్ అంటున్నారు. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 కూడా బోల్డ్ కంటెంట్ అంటూ వ‌స్తుంది. మ‌రి ఇందులో నిజంగానే బోల్డ్ ఉందా.. బూతు ఉందా..?
క‌థ‌:
శివ(కార్తికేయ‌) ఊళ్ళో థియేట‌ర్ న‌డుపుతుంటాడు. ప్ర‌తీ చిన్న విష‌యానికి గొడ‌వ ప‌డే ర‌కం. దేనికి బెద‌ర‌డు. ఇలాంటి శివ జీవితంలోకి ఇందు (పాయ‌ల్ రాజ్ పుత్) వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కు అన్నీ తానే డాడి(రాంకీ)నే అనుకున్న శివ‌కు మ‌రో లైఫ్ కూడా ఉంద‌ని తెలుస్తుంది. ఇందు కోసం ఏదైనా చేయ‌డానికి సై అంటాడు.
అలాంటి స‌మ‌యంలో ఇందు పెళ్లిని మ‌రొక‌రితో చేస్తాడు ఆమె తండ్రి విశ్వనాథ్ (రావురమేష్). శివ‌, డాడి ఈయ‌న కోస‌మే ప‌ని చేస్తుంటారు. ఆ త‌ర్వాత చిన్న గొడవ వ‌చ్చి విడిపోతారు. విశ్వనాథ్ తో గొడ‌వ స‌మ‌యంలోనే ఇందు పెళ్లి జ‌రిగిపోతుంది. దాంతో ఆమె కోసం పిచ్చోడిలా అన్నీ వ‌దిలేసి ఎదురు చూస్తుంటాడు శివ‌. ఆ త‌ర్వాత ఏమైంది.. అత‌డి ప్రేమ‌క‌థ‌కి ముగింపు ఏంటి అనేది క‌థ‌..
క‌థ‌నం:
బోల్డ్ సినిమాకు.. బూతు సినిమాకు మ‌ధ్య స‌న్న‌ని గీత ఒక‌టి ఉంటది.. అర్జున్ రెడ్డి బోల్డ్ సినిమా.. కాస్త బూతున్నా అందులో నిజాయితీ ఉంది. అలాగ‌ని బోల్డ్ కంటెంట్ అని చెప్పిన ప్ర‌తీ సినిమా అర్జున్ రెడ్డి కాదు క‌దా.. బోల్డ్ ముసుగులో బోలెడు బూతు సినిమాలు వ‌స్తున్నాయి. అంద‌రికీ అర్జున్ రెడ్డి ఒక్క‌డు దొరికాడు.. ముద్దులు పెట్టేసి.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు కొట్టేసుకుని.. బోల్డ్ కంటెంట్ అంటే స‌రిపోదు. ఆర్ఎక్స్ 100 ఇలా వ‌చ్చిన సినిమానే..
ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకుంది ఈ చిత్రం. నిజంగానే ఏదో ఉంది అనిపించింది.. కానీ అదొక్క‌టే ఉంద‌ని సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఏం తీయాల‌నుకున్నాడో.. చెప్పాల‌నుకున్నాడో ద‌ర్శ‌కుడికే తెలియ‌ని కంగాళీ ఈ ఆర్ఎక్స్ 100. బోల్డ్ కంటెంట్ ఇది.. అంద‌రికీ న‌చ్చ‌ద‌ని ముందే చెప్పేసాడు ద‌ర్శ‌కుడు.. హీరో. వాళ్లెవ‌రికి రీచ్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో సినిమా చేసారో.. వాళ్ల‌కు కూడా న‌చ్చ‌డం క‌ష్ట‌మే. ఐదంటే ఐదే నిమిషాల పాటు ఓ బోల్డ్ సాంగ్ తీసేసాడు ద‌ర్శ‌కుడు.
ముద్దులు హాట్ సీన్స్ తో అల్లాడించేసాడు. అదే ప్ర‌మోష‌న్ కు కూడా వాడుకున్నాడు. కానీ సినిమాలో క‌థ మాత్రం లేకుండా ఇవే ఉంటే ప్రేక్ష‌కులు చూస్తార‌నుకోవ‌డం ద‌ర్శ‌కుడి తెలివి త‌క్కువే. రెండు రోజులు ఆగితే యు ట్యూబ్ లో ద‌ర్శ‌న‌మిస్తాయిలే అనుకునే రకం ఇప్పుడు ప్రేక్ష‌కులు. ఆర్ఎక్స్ 100లో బోల్డ్ అనుకున్న కంటెంటే బూతు. హీరో చేతిలో ప్ర‌తీ సెక‌న్ సిగ‌రెట్, మందు చూపించ‌డం ద‌ర్శ‌కుడి దృష్టిలో బోల్డ్. ప్రేమ‌కు.. మోహానికి తేడా చూపించే క్ర‌మంలో హ‌ద్దులు దాటేయ‌డం ద‌ర్శ‌కుడి దృష్టిలో బోల్డ్. సీరియ‌ల్ కంటే దారుణంగా ల్యాగ్ చేస్తూ ప్ర‌తీ సీన్ చూపించ‌డం కూడా ఆయ‌న దృష్టిలో బోల్డ్. కొత్త‌గా తీయాల‌ని ట్రై చేసినా.. ఆర్ఎక్స్ 100 చివ‌రికి వ‌చ్చేస‌రికి బోర్ కు వ‌చ్చేసింది. దాంతో క్లైమాక్స్ లో చేసేదేం కూడా ఏం లేకుండా ముగించేసాడు ఈ ద‌ర్శ‌కుడు.
న‌టీన‌టులు:
హీరో కార్తికేయ బాగానే ఉన్నాడు.. న‌టించాడు కూడా. తొలి సినిమాతోనే ఇలాంటి కంటెంట్ ఎంచుకోవడం నిజంగా సాహ‌స‌మే. ఇది ఆయ‌న కెరీర్ కు యూజ్ అవుతుందేమో కానీ సినిమాకు మాత్రం కాదు. హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ ఇలాంటి పాత్ర చేయ‌డానికి ముందు ఒప్పుకుందంటే ఆమె గ‌ట్స్ కు దండం పెట్టాల్సిందే. రావుర‌మేష్ టిపిక‌ల్ తెలుగు సినిమా ఫాద‌ర్ రోల్ మ‌రోసారి చేసాడు. ఇక రాంకీ హీరో తండ్రి కాని తండ్రిగా బానే న‌టించాడు. మిగిలిన వాళ్లంతా ఉన్నారంటే ఉన్నారంతే.
టెక్నిక‌ల్ టీం:
ఆర్ఎక్స్ 100లో 9 పాట‌లు ఉన్నాయి. ఈ సినిమాకు ఇన్ని పాట‌లు అవ‌స‌రం లేదు కానీ క‌థ లేద‌నో ఏమో కానీ హీరో హీరోయిన్ క‌లిసినా.. విడిపోయినా పాటల‌నే న‌మ్ముకున్నాడు ద‌ర్శ‌కుడు. పిల్లా రాతో పాటు మ‌రో రెండు పాట‌లు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ చాలా వీక్. చాలాసీన్లు ఎత్తేయొచ్చేమో అనిపిస్తుంది. సీరియ‌ల్ కంటే దారుణంగా సెకండాఫ్ లో క‌థ సాగుతుంది. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా అజ‌య్ భూప‌తి డేరింగ్ స్క్రిప్ట్ ఎంచుకున్నాడు కానీ దాన్ని హ్యాండిల్ చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యాడు.
చివ‌ర‌గా:
ఆర్ఎక్స్ 100.. పిక‌ప్ త‌క్కువ‌.. అరుపులు ఎక్కువ‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here